రజినీ ఇంటికి బాంబ్ బెదిరింపు

సూపర్‌స్టార్ రజనీకాంత్ నివాసానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజినీ నివాసంలో బాంబ్ పెట్టినట్లు ఓ అగంతకుడు ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తయ్యారు. వెంటనే స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్టర్‌లతో రజినీ ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. కాగా ఈ వార్తతో తలైవా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. కాగా బాంబ్ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్న రజినీ.. […]

Update: 2020-06-18 07:41 GMT

సూపర్‌స్టార్ రజనీకాంత్ నివాసానికి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజినీ నివాసంలో బాంబ్ పెట్టినట్లు ఓ అగంతకుడు ఫోన్ చేయడంతో అధికారులు అప్రమత్తయ్యారు. వెంటనే స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్టర్‌లతో రజినీ ఇంటికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. కాగా ఈ వార్తతో తలైవా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. కాగా బాంబ్ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

ప్రస్తుతం ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్న రజినీ.. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News