నాడు గాయపడ్డ ఆడబిడ్డ.. నేడు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్

దిశ, ఫీచర్స్ : రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన శివాని సిసోడియా అనే పదో తరగతి అమ్మాయి.. రోజూ మాదిరి స్కూల్‌కు వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో కొందరు యువకులు తనను చుట్టుముట్టారు. వల్గర్ కామెంట్స్ చేస్తూ ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ఆ టైమ్‌లో శివాని తప్పించుకునే ప్రయత్నం చేసినా, తనవల్ల కాకపోవడంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. వెంటనే చుట్టుపక్కల వారు స్పందించడంతో ఆ అల్లరి మూక అక్కడి నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని తర్వాతి రోజున తన […]

Update: 2021-04-29 04:35 GMT

దిశ, ఫీచర్స్ : రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన శివాని సిసోడియా అనే పదో తరగతి అమ్మాయి.. రోజూ మాదిరి స్కూల్‌కు వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో కొందరు యువకులు తనను చుట్టుముట్టారు. వల్గర్ కామెంట్స్ చేస్తూ ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ఆ టైమ్‌లో శివాని తప్పించుకునే ప్రయత్నం చేసినా, తనవల్ల కాకపోవడంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. వెంటనే చుట్టుపక్కల వారు స్పందించడంతో ఆ అల్లరి మూక అక్కడి నుంచి పారిపోయింది. ఈ విషయాన్ని తర్వాతి రోజున తన స్నేహితురాళ్లతో పంచుకోగా, వాళ్లు కూడా తమకు ఎదురైన అలాంటి ఘటనలు గూర్చి చెప్పుకొచ్చారు. కాగా అందరి మాటలు విన్న శివానికి.. గర్ల్స్ ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలని, అలా అయితేనే తమను తాము రక్షించుకోగలుగుతారనే విషయం అర్థమైంది. ఈ మేరకు సెల్ఫ్ డిఫెన్స్ లెస్సన్స్ నేర్చుకునేందుకు భరత్‌పూర్‌లోని రాజస్థాన్ కరాటియన్స్ స్కూల్‌లో తన పేరు రిజిస్టర్ చేసుకుంది.

సెల్ఫ్ డిఫెన్స్ లెస్సన్స్ నేర్చుకోవాలనే శివాని నిర్ణయానికి తల్లిదండ్రులు మద్దతు తెలిపారు. అలా స్వీయ రక్షణ టెక్నిక్స్ నేర్చుకున్న శివాని.. అక్కడితోనే ఆగిపోలేదు. తను నేర్చుకున్న విద్యను ఇతరులకు కూడా నేర్పించాలని నిర్ణయించుకుని, 18 ఏళ్ల వయసులోనే తన జిల్లాలోని గర్ల్స్‌కు సెల్ఫ్ డిఫెన్స్ లెస్సన్స్ నేర్పించడం స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు 1,500 పాఠశాలలకు చెందిన గర్ల్ స్టూడెంట్స్‌కు ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించిన సివంగి శివాని.. ప్రస్తుతం బీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది.

ఉమెన్ స్ట్రాంగ్‌గా ఉండాలి..

మహిళలు ఎలాంటి సందర్భాన్ని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రతీసారి ఎవరో ఒకరు వచ్చి కాపాడతారనుకునే బదులు మనల్ని మనమే రక్షించుకోవాలి. నేను ఎలాంటి సిచ్యువేషన్‌లోనైనా నన్ను నేను రక్షించుకోగలను. ప్రతీ అమ్మాయి ఇటువంటి సామర్థ్యాలను, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌ను నేర్చుకోవాలి. నా ట్రైనర్ ఓంకార్ పంచాలి మాదిరి తాను కూడా గర్ల్స్, ఉమెన్స్‌కు ఫ్రీగా సెల్ఫ్ డిఫెన్స్ లెస్సన్స్ నేర్పిస్తున్నాను. భవిష్యత్తులో మరింత మందికి ఆత్మరక్షణ పాఠాలు నేర్పిస్తా.

– శివాని సిసోడియా, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనర్

Tags:    

Similar News