రాజస్తాన్ గవర్నర్‌కు మూడోసారి ప్రతిపాదన

జైపూర్: రాజస్తాన్ గత మూడు నాలుగు రోజులుగా సచిన్ పైలట్ పక్కకుతప్పి రాజకీయం గవర్నర్, సీఎం మధ్య నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు ప్రతిపాదనలు పంపడం, వాటిని గవర్నర్ తిరిగిపంపడం జరుగుతూనే ఉన్నది. తాజాగా, మంగళవారం సీఎం గెహ్లాట్ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని తెలుపుతూ జులై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మూడో సారి ప్రతిపాదనను పంపారు. గవర్నర్ లేవనెత్తిన అంశాలపై క్యాబినెట్ సమావేశంలో […]

Update: 2020-07-28 11:28 GMT

జైపూర్: రాజస్తాన్ గత మూడు నాలుగు రోజులుగా సచిన్ పైలట్ పక్కకుతప్పి రాజకీయం గవర్నర్, సీఎం మధ్య నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాకు ప్రతిపాదనలు పంపడం, వాటిని గవర్నర్ తిరిగిపంపడం జరుగుతూనే ఉన్నది.

తాజాగా, మంగళవారం సీఎం గెహ్లాట్ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని తెలుపుతూ జులై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మూడో సారి ప్రతిపాదనను పంపారు. గవర్నర్ లేవనెత్తిన అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఈ ప్రతిపాదనను పంపారు.

ఇదిలా ఉండగా, బీఎస్పీ చీఫ్ మాయావతి.. అశోక్ గెహ్లాట్‌పై నిప్పులు చెరిగారు. గెహ్లాట్ తమను మోసం చేశారని, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకునే కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు. ఆ ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయాలని, లేదంటే పార్టీ సభ్యత్వాన్ని తొలగిస్తామని హెచ్చరించారు.

అటు బీజేపీ హైకోర్టులో తాజాగా రెండు పిటిషన్లు దాఖలు చేసింది. బీఎస్పీ ఆరుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో కలుపుకోవడంపై అభ్యంతరం లేవనెత్తుతు స్పీకర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ వేసింది. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని ఫిర్యాదు చేయగా స్పీకర్ ఉదారంగా వ్యవహరించారని, తన ఫిర్యాదును తిరస్కరించారని బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ తెలిపారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

Tags:    

Similar News