250 కూడా ఛేదించగలం అనిపించింది : స్మిత్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా షార్జాలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు విశ్వరూపం ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లలో 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓపెనింగ్‌లో వచ్చి, అద్భుతంగా రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆట అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత మ్యాచ్ తర్వాత ఈ పిచ్ ఎలా ఉంటుందో ఒక అంచనా […]

Update: 2020-09-27 20:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2020లో భాగంగా షార్జాలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు విశ్వరూపం ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లలో 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓపెనింగ్‌లో వచ్చి, అద్భుతంగా రాణించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆట అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత మ్యాచ్ తర్వాత ఈ పిచ్ ఎలా ఉంటుందో ఒక అంచనా ఉంది. భారీ స్కోర్ అని మేం కొంచెం భయపడ్డాము. కానీ నేను, సంజూ బ్యాటింగ్ చేసిన తీరు చూసి లక్ష్యం చేరుకోగలం అని భావించాం. తెవాతియా మొదట్లో తడబడ్డా.. మేం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేశాడు. అతడి బ్యాటింగ్ చూసి 250 లక్ష్యమైనా ఛేదించగలం అనుకున్నాము’ అని స్టీవ్ స్మిత్ వెల్లడించారు.

Tags:    

Similar News