ఇంధన పొదుపు పై ప్రజలందరకి అవగాహన కల్పించాలి..
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంధన పొదుపుపై వినియోగదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ అన్నారు. జాతీయ ఇంధన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖైరతాబాద్‌లో నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ ఇంజనీర్స్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ 2021 సెలబ్రేషన్ ప్రారంభ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంధన పొదుపుపై వినియోగదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ అన్నారు. జాతీయ ఇంధన దినోత్సవం సందర్భంగా మంగళవారం ఖైరతాబాద్‌లో నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ ఇంజనీర్స్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ వీక్ 2021 సెలబ్రేషన్ ప్రారంభ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సునీల్ శర్మ తో పాటు రెడ్ కో ఎండి జానయ్య , చైర్మన్ బ్రహ్మారెడ్డి, ఇనుగుర్తి శ్రీనివాస చారి, సెక్రటరీ వెంకటసుబ్బయ్య హాజరై వేడుకల సావనీర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్ శర్మ మాట్లాడుతూ.. ఇంధన పొదుపు పై కేవలం ఒక వారం పాట కాకుండా 365 రోజులు వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు.
విద్యుత్ ను ఉత్పత్తి చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదన్నారు. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని విద్యుత్‌ను పొదుపు చేయగలిగితే, విద్యుత్ ను ఉత్పత్తి చేసినట్లే అన్నారు. నేడు సాంకేతిక పరంగా తక్కువ విద్యుత్ కాలే లైట్స్, ఫ్యాన్స్, ఏ.సిలు, వాషింగ్ మిషన్స్, తదితర గృహోపకరణాలు, 4 స్టార్స్, 5 స్టార్స్ రేటింగ్స్ తో మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని వినియోగించి విద్యుత్‌ను పొదుపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ చైర్మన్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, మాజీ చైర్మన్ ప్రొఫెసర్ రమణా నాయక్, జి. కె ఆనంద్, సుబ్బరాయుడు, సతీష్ కుమార్ కోర్ కమిటీ మెంబర్లు ఎం శ్రీనివాసరావు బి ప్రశాంత్ నర్సింగరావు లు పాల్గొన్నారు.