ఏపీలో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
ఏపీలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావారణం కేంద్రం తెలిపింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని.. […]
ఏపీలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావారణం కేంద్రం తెలిపింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయన్నారు. అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం కూడా ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. ఈ నెల 30న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Tags: rain, ap, weather department, IMD, krishna, guntoor