తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురియనున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండటంతో వర్షాలు కురియనున్నాయని అధికారులు తెలిపారు. సంగారెడ్డి, వరంగల్ అర్బన్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షాపాతం 9.3 మి.మీ ఉండగా.. అంతకుమించి 19.3 మి.మీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురియనున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుండటంతో వర్షాలు కురియనున్నాయని అధికారులు తెలిపారు. సంగారెడ్డి, వరంగల్ అర్బన్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షాపాతం 9.3 మి.మీ ఉండగా.. అంతకుమించి 19.3 మి.మీ వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని నామూరులో 139 మి.మీ వర్షాపాతం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలలో 115 మి.మీ వర్షాపాతం నమోదు కాగా, హైదరాబాద్లో 15.8 మి.మీ వర్షాపాతం నమోదైంది.