మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం
దిశ, వెబ్ డెస్క్: ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో తర్వాత తుఫాన్‌గా మారి ఉత్తర దిశగా మారుతోందని, రాగల 24 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవులు వరకు, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో రగాల మూడు రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని శాఖ అధికారులు […]
దిశ, వెబ్ డెస్క్: ఆదివారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో తర్వాత తుఫాన్‌గా మారి ఉత్తర దిశగా మారుతోందని, రాగల 24 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవులు వరకు, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో రగాల మూడు రోజులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని శాఖ అధికారులు తెలిపారు.
కాగా, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షపాతం నమోదయ్యింది. హైదరాబాద్‌తో పాటు జిల్లాలు జలమయమయ్యాయి. ముందుగా వచ్చిన వర్షాలతో ఎండ వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో హడలెత్తించిన ఎండలతో ఉక్కిరిబిక్కిరయిన నగరవాసులకు ఆదివారం వర్షపు చల్లదనంతో సేద తీరారు.