మూడ్రోజుల పాటు వర్షాలు
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో 172 మి.మీ., ములుగు జిల్లా మంగపేట మండలంలో 132.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ములుగు జిల్లా వెంకటాపూరంలో 76.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 69.3, నిజామాబాద్ జిల్లా దర్‌పల్లిలో 66.5, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 66 మి.మీ. వర్షం కురిసింది. అదే విధంగా నిజామాబాద్, ములుగు, జగిత్యాల, కరీంనగర్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో 172 మి.మీ., ములుగు జిల్లా మంగపేట మండలంలో 132.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ములుగు జిల్లా వెంకటాపూరంలో 76.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 69.3, నిజామాబాద్ జిల్లా దర్‌పల్లిలో 66.5, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 66 మి.మీ. వర్షం కురిసింది. అదే విధంగా నిజామాబాద్, ములుగు, జగిత్యాల, కరీంనగర్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
కాగా వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, వనపర్తితో పాటు పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయి. ఆ తర్వాత రెండు రోజుల పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, కామారెడ్డి ప్రాంతాల్లో మోస్తరు కురువనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.