అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కోస్తా, రాయలసీమలో రానున్న రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఇక బుధవారం ఉదయం కురిసిన […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కోస్తా, రాయలసీమలో రానున్న రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఓ ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఇక బుధవారం ఉదయం కురిసిన వర్షంతో జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రాజేంద్రనగర్ శివరాంపల్లిలో 18.5, కుషాయిగూడలో 16 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.