వెయిటింగ్ లిస్టు ఉన్న ప్రయాణికులు రావొద్దు..
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని రైల్వే అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రయాణికులంతా సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెయిటింగ్ లిస్టు ఉన్న ప్రయాణికులు రావొద్దని, టికెట్ కాన్ఫార్మ్ ఉంటేనే రావాలని కోరారు. ప్రయాణికులంతా ఫేస్ మాస్క్ ధరించాలని, ప్రయాణ సమయంలో భౌతిక దూరం పాటించాలన్నారు. శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని, థర్మల్ స్క్రినింగ్‌లో కోవిడ్ లక్షణాలు లేకుంటేనే రైల్వే స్టేషన్లోకి అనుమతించడం జరుగుతుందని […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనాకు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని రైల్వే అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రయాణికులంతా సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెయిటింగ్ లిస్టు ఉన్న ప్రయాణికులు రావొద్దని, టికెట్ కాన్ఫార్మ్ ఉంటేనే రావాలని కోరారు. ప్రయాణికులంతా ఫేస్ మాస్క్ ధరించాలని, ప్రయాణ సమయంలో భౌతిక దూరం పాటించాలన్నారు. శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలని, థర్మల్ స్క్రినింగ్‌లో కోవిడ్ లక్షణాలు లేకుంటేనే రైల్వే స్టేషన్లోకి అనుమతించడం జరుగుతుందని తెలిపారు. రైళ్లలో లెనిన్ దుప్పట్లు అందజేయబడవని ప్రయాణికులే తెచ్చుకోవాలని సూచించారు.