ఆ కారణంతోనే రాహుల్‌ను తీసుకోలేదు.. అసలు విషయం చెప్పిన కుంబ్లే

దిశ, వెబ్‌డెస్క్: IPL 2022లో భాగంగా ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. అనూహ్య రీతిలో జరిగిన ఈ రిటైన్ పద్ధతి అంచనాలకు అందకుండా సాగింది. కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, మరికొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తమ స్టార్ ఆటగాళ్లను సైతం వదిలేసుకొని అందరినీ అవాక్కయ్యేలా చేసాయి. దీంతో చాలామంది స్టార్ ఆటగాళ్లకు షాక్ తగిలినట్టైంది. కొందరు ఆటగాళ్లు జట్లను వదిలెయ్యగా, కొన్ని జట్లు ఆటగాళ్లనే వదులుకున్నాయి. ఇందులో భాగంగానే కేఎల్ రాహుల్ కూడా పంజాబ్ […]

Update: 2021-12-01 12:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: IPL 2022లో భాగంగా ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది. అనూహ్య రీతిలో జరిగిన ఈ రిటైన్ పద్ధతి అంచనాలకు అందకుండా సాగింది. కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా, మరికొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తమ స్టార్ ఆటగాళ్లను సైతం వదిలేసుకొని అందరినీ అవాక్కయ్యేలా చేసాయి. దీంతో చాలామంది స్టార్ ఆటగాళ్లకు షాక్ తగిలినట్టైంది. కొందరు ఆటగాళ్లు జట్లను వదిలెయ్యగా, కొన్ని జట్లు ఆటగాళ్లనే వదులుకున్నాయి.

ఇందులో భాగంగానే కేఎల్ రాహుల్ కూడా పంజాబ్ జట్టును వదిలేసాడు. దీంతో వేలంలోకి వెళ్లేందుకు ఇష్టపడటంతోనే రాహుల్‌ను రిటైన్ చేసుకోలేకపోయామని కుంబ్లే స్పష్టం చేశాడు. రాహుల్‌ను జట్టులో కొనసాగించేందుకు చివరి వరకు తీవ్రంగా ప్రయత్నించామని, అతనికి అనుగుణంగానే జట్టును నిర్మిద్దామనుకున్నామని కుంబ్లే తెలిపాడు. కానీ రాహుల్ మాత్రం వేలంలోకి వెళ్లేందుకే ఇష్టపడ్డాడని, అతని నిర్ణయాన్ని మేం గౌరవించామని చెప్పాడు. జట్టులో ఉండాలా? వద్దా? అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం’అని కుంబ్లే చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News