బీజేపీపై రాహుల్‌గాంధీ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో ఉచిత కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తామన్న బీజేపీ ప్రచార వాగ్దానంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఫైర్ అయ్యారు. అధికార పార్టీ ప్రజల ప్రాణాలను రక్షించే మందును ఎన్నికలతో ముడిపెట్టడం ఏంటని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రపంచం పరుగులు పెడుతోందని భారత్‌తో సహా అనేక దేశాల్లో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పరిశోధనలో ఉన్న టీకాను ఎన్నికల వాగ్దానంలో చేర్చడం ఇదే మొదటిసారని, మరి బీజేపీయేతర రాష్ర్టాల పరిస్థితి ఏంటి? బీజేపీకి […]
దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లో ఉచిత కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తామన్న బీజేపీ ప్రచార వాగ్దానంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఫైర్ అయ్యారు. అధికార పార్టీ ప్రజల ప్రాణాలను రక్షించే మందును ఎన్నికలతో ముడిపెట్టడం ఏంటని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రపంచం పరుగులు పెడుతోందని భారత్‌తో సహా అనేక దేశాల్లో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. పరిశోధనలో ఉన్న టీకాను ఎన్నికల వాగ్దానంలో చేర్చడం ఇదే మొదటిసారని, మరి బీజేపీయేతర రాష్ర్టాల పరిస్థితి ఏంటి? బీజేపీకి ఓటు వేయనివాళ్ళకు వ్యాక్సిన్ అందదా అని ప్రశ్నించారు. బీహార్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్… కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత ప్రతి పౌరుడికి ఉచితంగా టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.