ఆ విషయంలో మహ్మద్ షమీకి రాహుల్ గాంధీ సపోర్ట్

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌కు విఫలమైన వికెట్‌పై పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నది. అయితే పాకిస్తాన్ ఛేజ్ చేసే సమయంలో 18వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లోనే ఆ జట్టు విజయం సాధించింది. పాక్ బ్యాటర్లు సిక్సులు, బౌండరీలు బాది విజయాన్ని అందించారు. దీనిపై కొంత […]

Update: 2021-10-25 12:12 GMT

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌కు విఫలమైన వికెట్‌పై పాకిస్తాన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నది. అయితే పాకిస్తాన్ ఛేజ్ చేసే సమయంలో 18వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లోనే ఆ జట్టు విజయం సాధించింది. పాక్ బ్యాటర్లు సిక్సులు, బౌండరీలు బాది విజయాన్ని అందించారు. దీనిపై కొంత మంది సోషల్ మీడియా వేదికగా మహ్మద్ షమీపై విద్వేషాన్ని వెల్లగక్కారు. ఒక వర్గం వాడిగా పేర్కొంటూ అతడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. మహ్మద్ షమీకి తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి విద్వేషాలను వ్యాప్తి చేయడం మంచిది కాని.. ఆటను ఆటగానే చూడాలని రాహుల్ పేర్కొన్నారు. షమీకి తన ప్రేమలు తెలియజేశారు.

Tags:    

Similar News