కరోనాపై కంట్రోల్ లేదు.. ఉద్యోగాల ఊసే లేదు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు ఎక్కుపెట్టే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కారు పాలనాతీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా కట్టడి, వ్యాక్సిన్ల కొరత, యువతకు ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర వంటి అంశాల్లో కేంద్రం వైఖరిని నిరసించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘దేశంలో కరోనా కట్టడి లేదు. తగినన్ని వ్యాక్సిన్లూ లేవు. ఉద్యోగాల్లేవు. రైతులకు మద్దతు ధర లేదు. కార్మికుల ఆవేదనపై పట్టింపు లేదు. చిన్న, […]

Update: 2021-04-11 09:50 GMT

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు ఎక్కుపెట్టే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి మోడీ సర్కారు పాలనాతీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా కట్టడి, వ్యాక్సిన్ల కొరత, యువతకు ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర వంటి అంశాల్లో కేంద్రం వైఖరిని నిరసించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘దేశంలో కరోనా కట్టడి లేదు. తగినన్ని వ్యాక్సిన్లూ లేవు. ఉద్యోగాల్లేవు. రైతులకు మద్దతు ధర లేదు. కార్మికుల ఆవేదనపై పట్టింపు లేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు రక్షణ లేదు. మధ్యతరగతి ప్రజలు అసంతృప్తితో ఉన్నారు’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News