‘రాజీనామాలు ఆపి పోరాటానికి సిద్ధం కండి’
దిశ, వెబ్‌డెస్క్: అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మూడు రాజధానుల అంశంపై స్పందించిన ఆయన.. అమరావతి కోసం మహిళలే ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ పేరుతో.. రైతులను దగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్ కన్నా.. రాజీలేని పోరాటమే అవసరమని పవన్ గుర్తించాలంటూ రఘురామకృష్ణంరాజు సూచించారు. బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆలోచన […]
దిశ, వెబ్‌డెస్క్: అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. మూడు రాజధానుల అంశంపై స్పందించిన ఆయన.. అమరావతి కోసం మహిళలే ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ పేరుతో.. రైతులను దగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్ కన్నా.. రాజీలేని పోరాటమే అవసరమని పవన్ గుర్తించాలంటూ రఘురామకృష్ణంరాజు సూచించారు. బీటెక్ రవి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆలోచన మానుకొని పోరాటానికి దిగాలన్నారు. సీఎం జగన్ రిఫరెండం పెట్టి ప్రజల ఆలోచన తెలుసుకోండి అంటూ చురకలు వేశారు. తనకు భద్రత కల్పించాక అమరావతి రైతుల పక్షాన పోరాడుతా అని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.