విమర్శించిన వాళ్లంతా రాజీనామా చేయండి : రఘురామకృష్ణం రాజు

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీలో అంతర్గత పోరు ముదురుతోంది. జగన్ బొమ్మపెట్టుకుని గెలిచాడంటూ తనపై విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేసి, ఈ సారి జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచి చూపించాలని ఆ పార్టీ నరసాపుం ఎంపీ రఘురామకృష్ణం రాజు సవాల్ విసిరారు. జగన్ బతిమాలితేనే పార్టీలోకి వచ్చానని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే […]

Update: 2020-06-16 11:32 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీలో అంతర్గత పోరు ముదురుతోంది. జగన్ బొమ్మపెట్టుకుని గెలిచాడంటూ తనపై విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ నాయకులంతా తమ పదవులకు రాజీనామా చేసి, ఈ సారి జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచి చూపించాలని ఆ పార్టీ నరసాపుం ఎంపీ రఘురామకృష్ణం రాజు సవాల్ విసిరారు.

జగన్ బతిమాలితేనే పార్టీలోకి వచ్చానని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణరాజు ఒక ఇసుక దొంగ అన్నారు. ఇళ్ల స్థలాల్లో కూడా కోట్ల రూపాయలను దోపిడీ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు హుందా కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌కు జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, దీంతో ఆయన బాధపడ్డారని చెప్పారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

వైసీపీ ఎంపీలు గుంపుగా వస్తే సింహం సింగిల్ గానే వస్తుందంటూ రజనీకాంత్ డైలాగును పేల్చారు. జగన్ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే స్పష్టం చేశానని అన్నారు. అందుకే తాను జగన్ ఇంటికి వెళ్లడానికి ఇష్టపడకపోతే, ఎయిర్ పోర్టులో జగన్ తనను కలిశారని చెప్పారు.

Tags:    

Similar News