అక్కడ రేవంత్.. రఘునందన్.. నువ్వా.. నేనా.. ?
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని ప్రచారం జరుగుతుంటే, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం రఘునందన్ వర్సెస్ రేవంత్‌రెడ్డిగా మారింది. దుబ్బాక బైపోల్‌లో సెన్సేషనల్ విక్టరీ కొట్టి ఊపుమీదున్న రఘునందన్, అటు పీసీసీ చీఫ్ పదవి కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రేవంత్‌రెడ్డి.. సత్తా నిరూపించుకునేందుకు ట్రై చేస్తుండటంతో మల్కాజిగిరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్న అంశం ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారింది. దుబ్బాక వేవ్.. గ్రేటర్‌లోనూ కొనసాగించి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే […]
దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని ప్రచారం జరుగుతుంటే, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం రఘునందన్ వర్సెస్ రేవంత్‌రెడ్డిగా మారింది. దుబ్బాక బైపోల్‌లో సెన్సేషనల్ విక్టరీ కొట్టి ఊపుమీదున్న రఘునందన్, అటు పీసీసీ చీఫ్ పదవి కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రేవంత్‌రెడ్డి.. సత్తా నిరూపించుకునేందుకు ట్రై చేస్తుండటంతో మల్కాజిగిరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్న అంశం ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారింది. దుబ్బాక వేవ్.. గ్రేటర్‌లోనూ కొనసాగించి టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని నిరూపించేందుకు రఘునందన్ విశ్వప్రయత్నాలు చేస్తుండగా, ఎక్కువ డివిజన్లు గెలిచి పీసీసీకి లైన్ క్లియర్ చేసేకునేందుకు రేవంత్ సైతం తన వ్యూహాలతో దూసుకెళ్తున్నాడు.
ఎన్నికల షెడ్యూల్ సమయంలోనే రేవంత్‌రెడ్డికి మల్కాజిగిరి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించగా, మరుసటి రోజే బీజేపీ.. రఘునందన్‌కు మల్కాజిగిరి బాధ్యతలను అప్పగించడం విశేషం. దుబ్బాక విజయం వన్ టైమ్ వండరే అని రేవంత్ కామెంట్లు చేయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న కమలనాథులు.. దుబ్బాక గెలుపు వన్ టైమ్ వండర్ కాదు.. పార్టీ బలంతోనే గెలిచిందని ప్రూవ్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్‌ను రేవంత్ అడ్డాలోకే పంపడంతో అక్కడ పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఈక్రమంలోనే రెండు పార్టీల మధ్య పోరు కాస్త ఇద్దరు వ్యక్తుల నడుమ పోటీగా మారింది. వీటన్నింటికి తోడు ఇద్దరూ మాటకారులే కావడం, ఫైర్ బ్రాండ్‌గా పేరుండటంతో మల్కాజిగిరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ కామన్ పీపుల్‌లో నెలకొంది.
మల్కాజిగిరి పరిధిలో బీజేపీ కంటే తక్కువ సీట్లు సాధిస్తే పీసీసీ చీఫ్ పదవికి ఎఫెక్ట్ పడుతుందని భావిస్తున్న రేవంత్.. నియోజకవర్గ పరిధిలోని డివిజన్లలో గెలుపును సెమీ ఫైనల్‌గా భావించి తన శక్తిని మొత్తం ప్రచారంలో దారపోసి ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించేలా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ బీజేపీ కంటే ఎక్కువ డివిజన్లు గెలిస్తే.. పీసీసీ చీఫ్ విషయంలో వ్యతిరేకుల నోళ్లు మూయించొచ్చని భావిస్తున్నట్లుగా పార్టీలోని తన అనుచరుల్లో చర్చ నడుస్తోంది.
బల్దియాలో ఎగిరేది కాషాయ జెండానే అని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానిస్తుండటంతో అతిపెద్ద పార్లమెంట్ పరిధి అయిన మల్కాజిగిరిలో ఎక్కువ డివిజన్లు సాధించి మరోసారి హైకమాండ్ దృష్టిలో తనపేరు మారు మోగేలా చేసుకోవాలని రఘునందన్ ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ ఎక్కువ సీట్లు వస్తే గ్రేటర్ కుర్చీపై సైతం ఆశలు సజీవంగా ఉంటాయని, ఈ విషయంలో పార్టీకి కూడా ఎక్కువ హైప్ తేవచ్చని తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు. రెండు పార్టీలకు చెందిన ఇద్దరు బలమైన నేతలు అధిష్ఠానం దృష్టిలో పడేందుకు మల్కాజిగిరిని అడ్డాగా చేసుకోవడంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కాస్త.. గ్రేటర్ మల్కాజిగిరిగా మారి.. ప్రస్తుత పరిస్థితులు రఘునందన్ Vs రేవంత్‌రెడ్డిగా మార్చాయి.