హీరోగా రఘు కుంచె

సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు స్క్రీన్ పై మెరుస్తున్నారు. మ్యూజిక్ స్కిల్స్ తో మెప్పించిన వారే.. యాక్టింగ్ స్కిల్స్ తోనూ అదరగొడుతున్నారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ గా కాంప్లిమెంట్స్ అందుకుంటున్నారు. ఆల్రెడీ ఆ లిస్ట్ లో చేరిపోయారు రఘు కుంచె. పలాస 1978 చిత్రంలో విలన్ గా తన నటనతో మెప్పించిన రఘు కుంచె.. ఇప్పుడు హీరోగా మారిపోతున్నారు. ఓ పొలిటిషియన్ హత్యలో కీలక పాత్ర పోషించి 29 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న మహిళ కథ ఆధారంగా […]

Update: 2020-07-03 09:47 GMT

సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు స్క్రీన్ పై మెరుస్తున్నారు. మ్యూజిక్ స్కిల్స్ తో మెప్పించిన వారే.. యాక్టింగ్ స్కిల్స్ తోనూ అదరగొడుతున్నారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ గా కాంప్లిమెంట్స్ అందుకుంటున్నారు. ఆల్రెడీ ఆ లిస్ట్ లో చేరిపోయారు రఘు కుంచె. పలాస 1978 చిత్రంలో విలన్ గా తన నటనతో మెప్పించిన రఘు కుంచె.. ఇప్పుడు హీరోగా మారిపోతున్నారు. ఓ పొలిటిషియన్ హత్యలో కీలక పాత్ర పోషించి 29 ఏళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న మహిళ కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో తన భర్తగా కనిపించనున్నారు. 1991 మే 21న జరిగిన స్టోరీ లైన్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకులు మహేందర్ కొక్కిరిగడ్డ. రఘు కుంచె మురుగన్ గా కనిపించనున్న ఈ సినిమాను గోగో మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. బై లింగువల్ మూవీగా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో .. మహావిస్ఫోటనం వెనుక ఉన్న అందమైన ప్రేమకథను చూపించబోతున్నారట.

Tags:    

Similar News