కమిషనర్ దత్తత గ్రామంలో.. నిత్యావసర సరుకులు పంపిణీ

దిశ, నల్లగొండ: ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలను రక్షించడానికి పోలీసులు ముందుంటారు. ప్రస్తుత లాక్‌డౌన్ కాలంలో ప్రజల రక్షణ బాధ్యతలు మాత్రమే కాకుండా పేదల ఆకలి తీర్చడానికి కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని రాచకొండ, ఐదుదోనల తండాల్లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గతంలోనే రాచకొండ గ్రామాన్ని కమిషనర్ దత్తత తీసుకున్నారు. అయితే ఈ గ్రామంలో లాక్‌డౌన్‌తో […]

Update: 2020-05-18 05:52 GMT

దిశ, నల్లగొండ: ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజలను రక్షించడానికి పోలీసులు ముందుంటారు. ప్రస్తుత లాక్‌డౌన్ కాలంలో ప్రజల రక్షణ బాధ్యతలు మాత్రమే కాకుండా పేదల ఆకలి తీర్చడానికి కూడా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలోని రాచకొండ, ఐదుదోనల తండాల్లో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ 200 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గతంలోనే రాచకొండ గ్రామాన్ని కమిషనర్ దత్తత తీసుకున్నారు. అయితే ఈ గ్రామంలో లాక్‌డౌన్‌తో ఉపాధి లేక అనేక మంది పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమాచారం కమిషనర్ దృష్టికి రావడంతో సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. వదంతులు నమ్మకుండా దైర్యంగా ఉండాలని తెలిపారు.

Tags:    

Similar News