కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీపీ మహేశ్ భగవత్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్‌ను చేయనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. అనంతరం మొదటి టీకాను మహేశ్ భగవత్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ కోసం రాచకొండ కమిషనరేట్ పరిధిలో 48 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో […]

Update: 2021-02-06 01:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సినేషన్‌ను చేయనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. అనంతరం మొదటి టీకాను మహేశ్ భగవత్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సినేషన్ కోసం రాచకొండ కమిషనరేట్ పరిధిలో 48 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పోలీసు సిబ్బంది, ఆక్టోపస్, ఎస్ఎస్జీ, సీఆర్పీఎఫ్ వంటి బెటాలియన్లకు చెందిన 6 వేల మంది సిబ్బందికి కరోనా టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నాలుగు రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కరోనా టీకా సురక్షితమని… దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని.. ఎవరూ భయపడొద్దని మహేశ్ భగవత్ సూచించారు.

Tags:    

Similar News