రాచకొండలో 832 కేసులు నమోదు
దిశ, క్రైమ్ బ్యూరో : కరోనా మరింత వేగంగా విస్తరిస్తున్న నేథ్యంలో మాస్కులు ధరించని వారిపై మంగళవారం 832 కేసులు నమోదు చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎల్‌బీ నగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం.. మాస్క్ ధరించని వారిపై రూ.1000లు ఛలాన్ విధిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రధాన కూడళ్లలో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకూ రాచకొండ కమిషనరేట్ […]
దిశ, క్రైమ్ బ్యూరో : కరోనా మరింత వేగంగా విస్తరిస్తున్న నేథ్యంలో మాస్కులు ధరించని వారిపై మంగళవారం 832 కేసులు నమోదు చేసినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఎల్‌బీ నగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం.. మాస్క్ ధరించని వారిపై రూ.1000లు ఛలాన్ విధిస్తున్నామని అన్నారు. కరోనా వైరస్ రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రధాన కూడళ్లలో పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 వేల మంది పోలీసులు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నారని అన్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేసుకునే వారు రెండు వందల మంది కంటే ఎక్కువగా గుమిగూడకుండా పలు జాగ్రత్తలు వహించాలన్నారు. ఆ సమయంలో భౌతిక దూరం పాటించాలని, మాస్క్, శానిటైజర్ ను తప్పనిసరిగా వినియోగించాలని ప్రజలకు సూచించారు.