బార్‌కి వెళుతున్నారా?.. మీకో హెచ్చరిక
దిశ, తెలంగాణ బ్యూరో: బార్లకు వెళ్లే మందుబాబులపై కరోనా పంజా విసురుతుంది. బార్లలో, పబ్బుల్లో క్లోజుడ్ రూంలు ఉంటడంతో.. వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. కరోనా సెకండ్ విజృభించి ప్రాణాలను హరిస్తుంటే జల్సా రాయుళ్లకు ఇవేమి పట్టడం లేదు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా కాని బార్లకు, పబ్బులకు వెళుతున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో చాలా వరకు బార్లలో, పబ్బుల్లో సిబ్బందికి కరోనా సోకుతుంది. బార్లలో పనిచేసే 43 మందికి, పబ్బుల్లో […]
దిశ, తెలంగాణ బ్యూరో: బార్లకు వెళ్లే మందుబాబులపై కరోనా పంజా విసురుతుంది. బార్లలో, పబ్బుల్లో క్లోజుడ్ రూంలు ఉంటడంతో.. వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. కరోనా సెకండ్ విజృభించి ప్రాణాలను హరిస్తుంటే జల్సా రాయుళ్లకు ఇవేమి పట్టడం లేదు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా కాని బార్లకు, పబ్బులకు వెళుతున్న వారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో చాలా వరకు బార్లలో, పబ్బుల్లో సిబ్బందికి కరోనా సోకుతుంది. బార్లలో పనిచేసే 43 మందికి, పబ్బుల్లో పనిచేసే 22 మందికి మొత్తం 75 మందికి పైగా కరోనా వ్యాధి సోకినట్టు ప్రజావైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్పారు.
ఒక వైపు కరోనా వ్యాధితో ప్రాణాలు పోతున్నాకాని కొందరికి జల్సాలు, డ్యాన్స్ లు అవసరమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బార్లలో, పబ్బుల్లో కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం, రద్దీ ఎక్కవగా ఉండటంతో వైరస్ ఒకరి నుంచి మరోకరికి వేగంగా సోకుతుందని చెప్పారు. ఒక నిర్థిష్టమైన గదిలో గాలి, వెలుతురు లేకుండా ఉండటంతో వైరస్ వ్యాప్తికి సులభతరమవుతుందన్నారు అలాంటి ప్రదేశాలకు వెళుతున్న వారికి కరోనా వ్యాధి తప్పనిసరిగా సోకే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ప్రాణంకంటే ఎక్కువగా మందు పార్టీలకే ప్రాధాన్యమిస్తున్న వారు తమను తాము ఆత్మపరీశీలన చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భాద్యతగా కోవిడ్ నిబంధనలు పాటిస్తేనే కరోనా వ్యాధిని అరికట్టగలమని చెప్పారు. మాస్క్ ధరించి కరోనాను లాక్ చేయాలని పిలుపునిచ్చారు.