తమన్నా, కాజల్ చిత్రం ఓటీటీలో?
కరోనా కాలంలో.. చిన్న సినిమా నిర్మాతలకు ఓటీటీ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. అంతేకాదు.. ఏవేవో కారణాల వల్ల ఇప్పటి వరకు థియేటర్లో విడుదలకు నోచుకోని సినిమాలు కూడా కరోనా పుణ్యమాని.. ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా మంచి విజయం అందుకుంటే చాలు.. ఆ చిత్రాలను వేరే భాషల్లోనూ రీమేక్ చేయడం పరిపాటి. హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్రం కూడా ఆ కోవకు చెందినదే. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం […]
కరోనా కాలంలో.. చిన్న సినిమా నిర్మాతలకు ఓటీటీ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. అంతేకాదు.. ఏవేవో కారణాల వల్ల ఇప్పటి వరకు థియేటర్లో విడుదలకు నోచుకోని సినిమాలు కూడా కరోనా పుణ్యమాని.. ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా మంచి విజయం అందుకుంటే చాలు.. ఆ చిత్రాలను వేరే భాషల్లోనూ రీమేక్ చేయడం పరిపాటి. హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్రం కూడా ఆ కోవకు చెందినదే. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం 2013లో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు కంగనాకు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. ఆ చిత్రం నుంచే కంగనా బాలీవుడ్ క్వీన్‌గా మారిపోయిది. ఇక ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మొదలగు దక్షిణాది భాషల్లోనూ రీమేక్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్ విడుదలై కూడా సంవత్సరం దాటిపోయింది. కానీ ఇప్పటివరకు థియేటర్లో విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం. తాజాగా ఈ చిత్రం.. ఓటీటీలో రిలీజ్ అవుతుందని సమాచారం.
తెలుగులో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘దటీజ్ మహాలక్ష్మి’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ముందుగా నీలకంఠ దర్శకత్వం వహించారు. కారణాలు తెలియదు కానీ ఆయన సినిమా బాధ్యతల నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఇక తమిళంలో‘ ప్యారిస్ ప్యారిస్’ పేరుతో రూపొందిన ఈ చిత్రంలో నటి కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ పోషించగా, రమేష్ అరవింద్ దర్శకత్వం అందించారు. అదే విధంగా మలయాళంలో మంజిమా మోహన్ ప్రధాన పాత్రల్లో ‘జామ్‌జామ్’ పేరుతో, కన్నడంలో పరుల్ యాదవ్ నటించగా ‘బటర్ ప్లై’ పేరుతోనూ రూపొందింది. కాగా, ఈ చిత్రం మొదటి నుంచి ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే వచ్చింది. చివరకు సెన్సార్ విషయంలోనూ సమస్యలను ఎదుర్కొంది. నిర్మాణ కారక్రమాలను సైతం ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.