మరో 7,655 మంది వలస కూలీలకు సాయం
దిశ, నిజామాబాద్: జిల్లాలో కొత్తగా 7,655 మంది వలస కూలీలకు సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో 11,061 మంది వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, రూ. 500 పంపిణీ చేశామన్నారు. తాజాగా 7,655 మంది వలస కూలీలను గుర్తించి వీరికి కూడా సాయం అందించడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించామని కలెక్టర్ చెప్పారు. స్పందించిన ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆదివారం1,560 […]
దిశ, నిజామాబాద్: జిల్లాలో కొత్తగా 7,655 మంది వలస కూలీలకు సాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో 11,061 మంది వలస కూలీలకు ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, రూ. 500 పంపిణీ చేశామన్నారు. తాజాగా 7,655 మంది వలస కూలీలను గుర్తించి వీరికి కూడా సాయం అందించడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదించామని కలెక్టర్ చెప్పారు. స్పందించిన ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఆదివారం1,560 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. మిగతా వారికి సోమ, మంగళవారాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వలస కూలీలకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని లేదా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08462 220183 ఫోన్ చేసి వివరాలు తెలపాలని కలెక్టర్ కోరారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగులకు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటారో అదే విధంగా కరోనా వైరస్ బారిన పడి క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ నారాయణరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు ప్రత్యేక భవనాలను గుర్తించడంతోపాటు ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా గదులు ఏర్పాటు చేశామన్నారు. వైరస్ ఇతరులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
tags ; quarantine centers like hospitals, maintenance, collector narayana reddy, 7655 migrant labours, help