ఫ్లోరిడా మెనూలో ఫైథాన్ డిషెస్.!
దిశ, వెబ్‌డెస్క్: వియత్నాం ప్రజల ఫేవరెట్ ఫుడ్ లిస్ట్‌లో ‘పాము’ కర్రీస్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడి ప్రజలు చాలా కాలం నుంచే ‘పాము’లను ఆహారంగా తీసుకుంటున్నారు. హై బాడీ టెంపరేచర్స్, తల, కడుపు నొప్పులను తగ్గించడంలో స్నేక్ మీట్ ఉపయోగపడుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఇదేవిధంగా చైనా, హాంగ్‌కాంగ్, ఇండోనేషియా, థాయ్ ప్రజలు కూడా పాములను తినడానికి ఇష్టపడుతుండగా, చైనాలో అయితే ‘స్నేక్ సూప్’ చాలా పాపులర్ డిష్‌గా పేరుపొందింది. ఇక వీళ్లు పాములతోనే సరిపెట్టుకుంటే.. […]
దిశ, వెబ్‌డెస్క్: వియత్నాం ప్రజల ఫేవరెట్ ఫుడ్ లిస్ట్‌లో ‘పాము’ కర్రీస్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇక్కడి ప్రజలు చాలా కాలం నుంచే ‘పాము’లను ఆహారంగా తీసుకుంటున్నారు. హై బాడీ టెంపరేచర్స్, తల, కడుపు నొప్పులను తగ్గించడంలో స్నేక్ మీట్ ఉపయోగపడుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ఇదేవిధంగా చైనా, హాంగ్‌కాంగ్, ఇండోనేషియా, థాయ్ ప్రజలు కూడా పాములను తినడానికి ఇష్టపడుతుండగా, చైనాలో అయితే ‘స్నేక్ సూప్’ చాలా పాపులర్ డిష్‌గా పేరుపొందింది. ఇక వీళ్లు పాములతోనే సరిపెట్టుకుంటే.. ఫ్లోరిడావాసులు ఏకంగా ‘పైథాన్’ వంటకాలు తినేందుకు సిద్ధపడుతున్నారు. ఏంటీ కొండచిలువను తింటారా? అని ఆశ్చర్యపోతున్నారా? ఊహించడానికి ఒళ్లు జలదరిస్తుందా? ‘పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి’ అని పెద్దలు ఇలాంటి వాళ్లను చూసే అన్నారేమో.
సాధారణంగా కొండచిలువలు 20 అడుగులకు పైగా పొడవుండటంతో పాటు చాలా బలమైనవి కావడం వల్ల ఆహారం ఎక్కువగానే అవసరమవుతుంది. ఇవి ఓ మోస్తరు పరిమాణానికి పెరిగిన తర్వాత.. ఎలుకలు, చిన్న చిన్న జంతువులతో వాటి ఆకలి తీరదు. దాంతో మొసలి, ఆవులు, జింకలు, దుప్పుల వంటి పెద్ద జంతువులను ఎంచుకుని మరీ దాడిచేస్తుంటాయి. ఈ క్రమంలోనే దక్షిణ ఫ్లోరిడాలో పెద్దసంఖ్యలో ఉన్న బర్మీస్ పైథాన్‌లు.. స్థానిక వన్యప్రాణులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దాంతో వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే.. ఫ్లోరిడా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ కమిషన్, ఫ్లోరిడా హెల్త్ డిపార్ట్‌మెంట్స్ సంయుక్తంగా ‘ద పైథాన్ ఎలిమేషన్ ప్రోగ్రామ్’ చేపట్టాయి.
ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే 6 వేల పైథాన్‌లను చంపేయగా, ఈ కొండ చిలువలను తినొచ్చా? అన్న కోణంలోనూ పరిశోధనలు సాగిస్తున్నాయి. ఒకవేళ వీటిల్లో మెర్క్యూరీ లెవల్స్ తక్కువగా ఉంటే, ఆరోగ్యపరంగా వాటిని తినడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ భావిస్తోంది. పైథాన్‌లను తింటే ఎలాంటి ప్రమాదం జరగదని పరిశోధకులు నిర్ధారణకు వచ్చిన తర్వాత, ఫ్లోరిడా మెనూలో వీటిని చేర్చేందుకు ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ కమిషన్ సిద్ధమవుతోంది. అంటే.. ఫ్లోరిడా వాసులు మరికొద్ది రోజుల్లో ‘ఫైథాన్’ వంటకాల రుచి చూడబోతున్నారన్నమాట.