ఆకలితో మేకను మింగేసింది

దిశ, వెబ్‌డెస్క్: ఆకలేసిందని మేకను మింగిన కొండచిలువ ఆ తర్వాత ఆగమాగం అయింది. మనుషులనే మింగేసే కొండచిలువ ఆదమరిచి నిద్రపోతుంది. కానీ, ఓ మేకను జనారణ్యంలో మింగి ఎక్కడికి పోవాలో తెలియక.. ముందుకు కదల్లేక నానా అవస్థలు పడిండి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాంపూర్ జిల్లాలోని సిహారీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సిహారీ గ్రామంలో ఓ కొండచిలువ ఆకలితో పెద్ద మేకను మింగేసింది. ఆ తర్వాత ఎక్కడికి కదల్లేక నానా తంటాలు పడింది. ఇది గమనించిన గ్రామస్తులు […]

Update: 2020-09-28 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆకలేసిందని మేకను మింగిన కొండచిలువ ఆ తర్వాత ఆగమాగం అయింది. మనుషులనే మింగేసే కొండచిలువ ఆదమరిచి నిద్రపోతుంది. కానీ, ఓ మేకను జనారణ్యంలో మింగి ఎక్కడికి పోవాలో తెలియక.. ముందుకు కదల్లేక నానా అవస్థలు పడిండి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాంపూర్ జిల్లాలోని సిహారీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.

సిహారీ గ్రామంలో ఓ కొండచిలువ ఆకలితో పెద్ద మేకను మింగేసింది. ఆ తర్వాత ఎక్కడికి కదల్లేక నానా తంటాలు పడింది. ఇది గమనించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఎట్టకేలకు కొండచిలువను ట్రాక్టర్‌లో ఎక్కింటి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

Tags:    

Similar News