ఆపరేషన్ ఫ్రం హైదరాబాద్.. రామగుండంలో ‘పుట్ట’ విచారణ
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ఇంటరాగేషన్ అంతా హైదరాబాద్ నుండే సాగుతున్నట్టుగా ఉంది. ఉన్నతాధికారుల నుండి వచ్చిన ప్రశ్నలనే రామగుండం పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్న పోలీసు అధికారులు అన్ని కోణాల్లో విచారించేందుకు ఎప్పటికప్పుడు ప్రశ్నల జాబితాను హైదరాబాద్ నుండే పంపిస్తున్నారని సమాచారం. పుట్ట మధు నుండి వస్తున్న సమాధానాలను కాన్పిడెన్షియల్ ఫైల్‌గా ఎప్పటికప్పుడు రామగుండం పోలీసులు చేరవేస్తున్నారని తెలుస్తోంది. పుట్ట మధు మర్డర్ కేసులో […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు ఇంటరాగేషన్ అంతా హైదరాబాద్ నుండే సాగుతున్నట్టుగా ఉంది. ఉన్నతాధికారుల నుండి వచ్చిన ప్రశ్నలనే రామగుండం పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్న పోలీసు అధికారులు అన్ని కోణాల్లో విచారించేందుకు ఎప్పటికప్పుడు ప్రశ్నల జాబితాను హైదరాబాద్ నుండే పంపిస్తున్నారని సమాచారం. పుట్ట మధు నుండి వస్తున్న సమాధానాలను కాన్పిడెన్షియల్ ఫైల్‌గా ఎప్పటికప్పుడు రామగుండం పోలీసులు చేరవేస్తున్నారని తెలుస్తోంది. పుట్ట మధు మర్డర్ కేసులో కన్ఫెస్ అయ్యాడా లేదా అన్న విషయాన్ని కూడా రామగుండం పోలీసులు బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతా గప్ చుప్‌గా విచారణ సాగుతున్నట్టుగా సమాచారం.
లీకుపై ఆరా..?
ఏప్రిల్ 30న పుట్ట మధు నిఘా కళ్ల నుంచి తప్పించుకున్నాడంటే ఆయనకు ముందస్తుగా సమాచారం ఎలా లీకైంది అన్న విషయంపై కూడా పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో ఎవరి పాత్ర ఉందన్న కోణంలోనూ తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు నిమగ్నం అయినట్టు సమాచారం.
వల వేసి పట్టుకున్నారు..
పుట్ట మధును భీమవరంలో ఓ చేపల చెరువు యజమాని వద్ద ఉన్నట్టుగా తెలియడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వలవేసి పట్టుకున్నారని సమాచారం. అయితే ఆయన అక్కడ షెల్టర్ తీసుకునేందుకు సహకరించిన వారెవరూ, వారితో మధుకు ఉన్న సాన్నిహిత్యం ఏంటన్న విషయంపై పోలీసు అధికారులు తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది.
బినామీలపైనా ఆరా..
పుట్ట మధు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంతో పాటు బినామీలు ఎవరన్నది కూడా తెలుసుకునే పనిలో అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆయన కూడబెట్టిన డబ్బును ఎక్కడెక్కడ దాచి పెట్టారు, ఎవరెవరి పేరిట ఆస్థులు ఉన్నాయన్న విషయం తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బినామీలను గుర్తించిన తరువాత వారి ఆదాయాలను కూడా పరిశీలించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టయితే వారిపైనా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపున వేరే రాష్ట్రంలో సెటిల్ అయిన పుట్ట మధు సన్నిహితుని సమీప బంధువు ఓ పోలీసు అధికారిగా పని చేస్తున్నారని తెలుస్తోంది. ఆయను నయీంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కావడంతో అంతకుముందు వీరు గ్యాంగ్ స్టర్‌తో సంబంధాలు ఏర్పరుచుకుని ఉంటారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.