టీ.మటన్ పెట్టి.. మా పొట్ట కొట్టకండి…

దిశ, షాద్ నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘టీ’ మటన్ బ్రాండ్ పేరుతో మటన్ క్రయవిక్రయాలు జరిపేందుకు తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఆరెకటికల పొట్టకొట్టకుండా ప్రభుత్వ తన నిర్ణయం విరమించుకొనేలా చూడండంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మెయిల్ ద్వారా ఆరెకటిక యువత రాష్ట్ర అధ్యక్షుడు మల్తుంకార్ శివాజీ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాలలో ఆరెకటికలను ఆదుకుంటామని చెప్పి ఆదుకోకపోగా టీ బ్రాండ్ పేరుతో మటన్ […]

Update: 2021-06-20 06:59 GMT
malthumkar shivaji
  • whatsapp icon

దిశ, షాద్ నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘టీ’ మటన్ బ్రాండ్ పేరుతో మటన్ క్రయవిక్రయాలు జరిపేందుకు తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఆరెకటికల పొట్టకొట్టకుండా ప్రభుత్వ తన నిర్ణయం విరమించుకొనేలా చూడండంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మెయిల్ ద్వారా ఆరెకటిక యువత రాష్ట్ర అధ్యక్షుడు మల్తుంకార్ శివాజీ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాలలో ఆరెకటికలను ఆదుకుంటామని చెప్పి ఆదుకోకపోగా టీ బ్రాండ్ పేరుతో మటన్ దుకాణాల ఏర్పాటు, మటన్ హోం డెలివరీ స్కీంతో మా నోటికాడి ముద్దకూడా లాకున్నే ప్రయత్నం చేయడమే కాకుండా ఆరెకటికలు కులవృత్తికి దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గవర్నర్ జోక్యం చేసుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విరమించేలా చూడాలని ఆయన కోరారు.

Tags:    

Similar News