పూరి మాటే తూటా.. పోడ్‌కాస్ట్‌‌తో నయా ఆట !

దిశ, వెబ్‌డెస్క్ : ‘చెప్పేవాడు లేక చెడిపోతున్నారని అంటుంటారు.. అందుకే నేను చెప్తా.. నా స్టైల్‌లో చెప్తా.. మీ స్టైల్‌లో మీరు విని బాగుపడండి.. సమాజాన్ని బాగుపడనివ్వండి’ అనే ఉద్దేశ్యంతో డైరెక్టర్ పూరి జగన్నాధ్ పోడ్‌కాస్ట్ ప్రారంభించారు. ప్రతీ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడంలో తనకున్న బ్రాండ్‌ను కంటిన్యూ చేస్తూ.. తనదైన స్టైల్‌లో ‘నువ్వు ఎంత వెధవవో నీకు అర్థమవుతుందా.. ఇప్పటికైనా కళ్లు తెరువు!’ అంటూ ఓ ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం రెండు నుంచి నాలుగు నిమిషాల నిడివితో […]

Update: 2020-08-29 02:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘చెప్పేవాడు లేక చెడిపోతున్నారని అంటుంటారు.. అందుకే నేను చెప్తా.. నా స్టైల్‌లో చెప్తా.. మీ స్టైల్‌లో మీరు విని బాగుపడండి.. సమాజాన్ని బాగుపడనివ్వండి’ అనే ఉద్దేశ్యంతో డైరెక్టర్ పూరి జగన్నాధ్ పోడ్‌కాస్ట్ ప్రారంభించారు. ప్రతీ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడంలో తనకున్న బ్రాండ్‌ను కంటిన్యూ చేస్తూ.. తనదైన స్టైల్‌లో ‘నువ్వు ఎంత వెధవవో నీకు అర్థమవుతుందా.. ఇప్పటికైనా కళ్లు తెరువు!’ అంటూ ఓ ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం రెండు నుంచి నాలుగు నిమిషాల నిడివితో డిజైన్ చేసిన పాడ్ కాస్ట్.. తరగతి గదుల్లో వినిపిస్తే నెక్స్ట్ జనరేషన్ చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటుందనే అభిప్రాయం తెరపైకొచ్చిందంటేనే.. పూరి చెప్పే విషయం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

మనీ నుంచి హ్యుమానిటీ వరకు.. అమ్మ నుంచి లవర్ వరకు… లవ్ నుంచి బ్రేకప్ వరకు.. ఫ్రెండ్ నుంచి ఎనిమీ వరకు.. నెట్ నుంచి నేషన్ వరకు.. ప్లాస్టిక్ నుంచి కాఫీ పవర్ వరకు.. గర్ల్స్ నుంచి ట్రీస్ వరకు.. ఇలా పూరి ఏ టాపిక్ గురించి చెప్పినా సరే, అందులో మనం చేసే తప్పొప్పులు కనిపిస్తాయి. అరే ఇలా చేసి ఉండకూడదేమో అనే భావన మొదలవుతుంది. మనల్ని చాలా చాలా బాధించే ప్రతీ చిన్న విషయాన్ని ‘డ్రోన్’ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుందని వివరించినా, నీకు నచ్చిన జాబ్ ఎంజాయ్ చేస్తే నువ్వు ‘ఎక్స్‌పర్ట్’ అంతే నీకు తిరుగులేదని చెప్పినా, అప్పుడప్పుడు నీతో నువ్వు నగ్నంగా మాట్లాడుకో.. అప్పుడే నీ భవిష్యత్ ఏంటో తెలుస్తుందని హెచ్చరించినా, పూరి చెప్పే విధానంలో ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైలే పూరి పోడ్‌కాస్ట్‌ను వరల్డ్ నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది.

పూరి పోడ్‌కాస్ట్‌లో పెంగ్విన్స్ స్టోరీకి చాలా మంది అభిమానులున్నారు. నిజానికి పెంగ్విన్స్‌లో ఇంత గొప్ప ప్రేమ దాగి ఉందని చాలా మంది తెలుసుకుంది కూడా ఈ పోడ్‌కాస్ట్ వల్లే. ‘చూడడానికి చాలా అందంగా ఉండే పెంగ్విన్స్.. బ్లాక్ టెక్సిడో వేసుకుని మనిషి నడుస్తున్నట్లే నడుస్తాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల కింద ఎగిరే స్వభావం కోల్పోయినా, ఫ్లిప్పర్స్‌తో చాలా ఫాస్ట్‌గా స్విమ్మింగ్ చేస్తాయి. అసాధారణ వాతావరణ పరిస్థితుల్లోనూ జీవించే పెంగ్విన్స్ ప్రేమలో కూడా పడతాయి. మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్‌కు అందమైన పెబుల్(ఒక నునుపైన రాయి) ఇస్తుంది. ఆ ఫెబుల్‌ను తీసుకుంటే ఆడ పెంగ్విన్ ప్రేమను యాక్సెప్ట్ చేసినట్లే! ఇవి చాలా ఎమోషనల్. ఇప్పటి వరకు ఏ మగ పెంగ్విన్ కూడా ఆడ పెంగ్విన్‌ను చీట్ చేయలేదు. కానీ ఆడ పెంగ్విన్ చీట్ చేస్తే మాత్రం అవి చాలా హర్ట్ అవుతాయి. జాతిని, సముద్రతీరాన్ని వదిలేసి.. దూరంగా తిండి దొరకని డ్రైలాండ్‌కు వెళ్లి.. నిల్చొని నిల్చొని ఆకలితో సూసైడ్ చేసుకుంటాయి. అంత ఆత్మాభిమానం ఉంటుందట పెంగ్విన్స్‌కు.

పెంగ్విన్‌కు మనిషికి మధ్య అనుబంధం కూడా చాలా గొప్పది. ఓ సారి బ్రెజిల్ రియో దగ్గర్లోని కోస్టల్ ఐలాండ్‌లో ఒక పెంగ్విన్ గాయపడి కదల్లేని స్థితిలో ఉంది. ఓ వృద్ధుడు దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి తనతో పాటే ఇంట్లో ఉంచుకున్నాడు. ఆరోగ్యం మెరుగయ్యాక ఆ పెంగ్విన్‌ను సముద్రంలో వదిలేసిన ఆ ముసలాయన.. అప్పటి నుంచి సరిగ్గా అన్నం కూడా తినేవాడు కాదు. కానీ ఆశ్చర్యంగా ఏడాది తర్వాత ఆ పెంగ్విన్ ఆ 70 ఏళ్ల ముసలాయనను చూసేందుకు తిరిగొచ్చింది. తన జాతిని వదిలి తన కోసం 5000 కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చిన పెంగ్విన్‌ను చూసి అతను ఏడ్చేశాడు. నెలరోజులు ముసలాయనతో స్పెండ్ చేసి మళ్లీ తన జాతిని వెతుక్కుంటూ వెళ్లింది. ఇలా ఏడాదికోసారి వచ్చి.. తనతో గడిపి వెళ్లిపోతుంటుంది. ఇప్పుడు ఆ ముసలాయనకు 80 ఏళ్లు. మరోసారి పెంగ్విన్, ముసలాయన కలిసే చాన్స్ ఉంటుందో లేదో తెలియదు.

ఇలాంటి ఎమోషనల్ స్టోరీ మాత్రమే కాదు.. మనల్ని మెంటల్‌గా బలవంతుల్ని చేసే, మనల్ని మనం కనుగొనే ఇలాంటి ఎన్నో కథలు పూరి పోడ్‌కాస్ట్‌లో ఉన్నాయి. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్న పూరి పోడ్‌కాస్ట్ మీరు వినకుంటే ఒక చెవి వేయండి మరి. ముఖ్యంగా భారతీయులు అయితే ‘మేరా భారత్ మహాన్’ అనే పోడ్‌కాస్ట్ వినండి.. కొంచెం అయినా రియలైజ్ అవుతారు.

Tags:    

Similar News