చిన్నపిల్లలే ఆ సైకో టార్గెట్.. అదును చూసి కిడ్నాప్, ఆపై..!

దిశ, వెబ్‌డెస్క్ : సైకో మనస్తత్వం కలిగిన కొందరు వ్యక్తులు చూసేందుకు నార్మల్‌గా కనిపించినా అదును చూసి తమలోని రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. కొందరు మహిళలు, వృద్ధులపై దాడులతో ఆపేస్తే.. మరికొందరు దారుణ హత్యలకు తెగబడుతుంటారు. తాజాగా ఇలాంటి సైకోనే చిన్న పిల్లలను టార్గెట్ చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా చిన్నపిల్లలను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు ఆ సైకోను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకివెళితే.. ఒడిశాకు చెందిన అభిరామ్ అనే వ్యక్తి కొంతకాలంగా జవహర్ నగర్‌లో నివాసముంటున్నాడు. సైకోగా […]

Update: 2021-07-10 07:30 GMT
చిన్నపిల్లలే ఆ సైకో టార్గెట్.. అదును చూసి కిడ్నాప్, ఆపై..!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : సైకో మనస్తత్వం కలిగిన కొందరు వ్యక్తులు చూసేందుకు నార్మల్‌గా కనిపించినా అదును చూసి తమలోని రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. కొందరు మహిళలు, వృద్ధులపై దాడులతో ఆపేస్తే.. మరికొందరు దారుణ హత్యలకు తెగబడుతుంటారు. తాజాగా ఇలాంటి సైకోనే చిన్న పిల్లలను టార్గెట్ చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా చిన్నపిల్లలను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు ఆ సైకోను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

వివరాల్లోకివెళితే.. ఒడిశాకు చెందిన అభిరామ్ అనే వ్యక్తి కొంతకాలంగా జవహర్ నగర్‌లో నివాసముంటున్నాడు. సైకోగా మారిన అతను ఈనెల 4న మూడున్నరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. నిన్న మరొక బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా విఫలమయ్యాడు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న రాచకొండ పోలీసులు నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సీపీ మహేశ్ భగవత్ ప్రకటించారు. కీచక అభిరామ్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీపీ వెల్లడించారు.

Tags:    

Similar News