‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థికసహాయం ఇవ్వాలి’

దిశ, జడ్చర్ల : తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కొవిడ్ కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని మహబూబ్‌‌నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. రూల్ నెంబర్ 377 క్రింద ఇచ్చిన వాయిదా తీర్మానంలో ఈ విషయాన్ని ఎంపీ సభలో ప్రస్తావనకు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంతో మందికి […]

Update: 2021-07-22 08:43 GMT

దిశ, జడ్చర్ల : తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కొవిడ్ కారణంగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయని, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని మహబూబ్‌‌నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. రూల్ నెంబర్ 377 క్రింద ఇచ్చిన వాయిదా తీర్మానంలో ఈ విషయాన్ని ఎంపీ సభలో ప్రస్తావనకు తెచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంతో మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉపాధి కల్పిస్తున్నాయని, కొవిడ్ విలయతాండవంతో ఆ పరిశ్రమలన్నీ మూతపడ్డాయని పర్యవసానంగా వేలాది మంది ఉపాధి కోల్పోయారన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News