‘టీపీసీసీపై కుట్ర’.. రేవంత్ రెడ్డి స్థానంలో ఎంపీ రంజిత్ రెడ్డి
దిశ, ఎల్బీనగర్: రాచకొండ కమిషనరేట్ క్యాంపు కార్యాలయం సాక్షిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అవమానం జరిగింది. ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై.. రూ. 1.20 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు శిలాఫలకంపై ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఏర్పాటు […]
దిశ, ఎల్బీనగర్: రాచకొండ కమిషనరేట్ క్యాంపు కార్యాలయం సాక్షిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అవమానం జరిగింది. ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై.. రూ. 1.20 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు శిలాఫలకంపై ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు శిలాఫలకాలపై స్థానిక ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు విస్మరించారు. ఆయన స్థానంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేరును లిఖించారు. దీంతో కావాలనే రేవంత్‌రెడ్డి పేరును తొలగించారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డికి బదులు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పేరును శిలాఫలకంపై ఏర్పాటు చేయడం చర్చనీయంశంగా మారింది. ప్రోటోకాల్‌కు విరుద్ధంగా కావాలనే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు రేంత్‌రెడ్డి పేరు లేకుండా కుట్ర చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.