ఎస్ఎస్‌బీఎన్‌లో మళ్లీ నిరసన సెగ.. ఫీజులు తగ్గించాలని డిమాండ్
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురంలోని ఎస్ఎస్‌బీఎన్ ఎయిడెడ్ కాలేజీ ప్రాంగణం మరోసారి నిరసనలతో హోరెత్తింది. ఈ కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గతంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఫీజులు భారీగా పెంచారని… తక్షణమే వాటిని తగ్గించాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ కాలేజీ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు బైఠాయించి పెంచిన ఫీజులు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఫీజులు తగ్గించే వరకు ఇక్కడి నుంచి […]
దిశ, ఏపీ బ్యూరో: అనంతపురంలోని ఎస్ఎస్‌బీఎన్ ఎయిడెడ్ కాలేజీ ప్రాంగణం మరోసారి నిరసనలతో హోరెత్తింది. ఈ కాలేజీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గతంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం ఫీజులు భారీగా పెంచారని… తక్షణమే వాటిని తగ్గించాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ కాలేజీ ప్రధాన ద్వారం ఎదుట విద్యార్థులు బైఠాయించి పెంచిన ఫీజులు తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఫీజులు తగ్గించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని అక్కడే కూర్చుని నిరసన తెలిపారు. ఆందోళనను కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు.