ఎస్సైలను సస్పెండ్ చేయాలని.. వ్యవసాయ అధికారుల రాస్తారోకో
దిశ, చండూర్: చండూర్, గుడిపల్లి ఎస్సైలను సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం, తెలంగాణ వ్యవసాయ విస్తీర్ణ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చండూర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అమరేందర్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చండూరు, గుడిపల్లి ఎస్సైలు విచారణ పేరుతో చండూరు ఏఓను, ఏఈఓలను గుడికల్ పోలీస్ స్టేషన్ కు పిలిచి నానా బూతులు తిడుతూ ఇబ్బందులకు […]
దిశ, చండూర్: చండూర్, గుడిపల్లి ఎస్సైలను సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం, తెలంగాణ వ్యవసాయ విస్తీర్ణ అధికారుల సంఘం ఆధ్వర్యంలో చండూర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు అమరేందర్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చండూరు, గుడిపల్లి ఎస్సైలు విచారణ పేరుతో చండూరు ఏఓను, ఏఈఓలను గుడికల్ పోలీస్ స్టేషన్ కు పిలిచి నానా బూతులు తిడుతూ ఇబ్బందులకు గురిచేశారని, ప్రభుత్వం వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులకు మద్దతుగా ఎరువుల దుకాణదారులు, రైతులు ఈ నిరసన లో పాల్గొన్నారు. ఏఈఓ సంఘం అధ్యక్షులు కర్నాటి అనిల్ కుమార్, ముజాహిద్, దేవేందర్, అభిలాష్, ఏఓలు అధ్యక్షులు మల్లేశ్, సుమన్ కుమార్, పద్మ, శ్రీనివాస్ గౌడ్, విజయ రెడ్డి, ఎరువుల దుకాణం దారులు గణేష్, వెంకటేశం, రైతు సమన్వయ సమన్వయ సమితి చామలపల్లి అధ్యక్షులు దేవేందర్, వెంకట్ రెడ్డి, రైతులు వెంకన్న, శేఖర్ రెడ్డి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.