నూతన విద్యా విధానం అమలుకు నిరసన..!
దిశ, సిద్దిపేట: జాతీయ నూతన విద్యా విధానం 2020 అమలును నిరసిస్తూ సిద్దిపేటలోని హైస్కూల్ ఎదుట టీచర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అఖిల భారత విద్యా హక్కుల వేదిక, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమీటీ సభ్యులు మల్లయ్య, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి, దామోదర్, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర […]
దిశ, సిద్దిపేట: జాతీయ నూతన విద్యా విధానం 2020 అమలును నిరసిస్తూ సిద్దిపేటలోని హైస్కూల్ ఎదుట టీచర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అఖిల భారత విద్యా హక్కుల వేదిక, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమీటీ సభ్యులు మల్లయ్య, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, చంద్రశేఖర్, రవీందర్ రెడ్డి, దామోదర్, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలకు, లౌకికవాదానికి భిన్నంగా ఉన్న నూతన విద్యా విధానాన్ని నిరసిస్తున్నామని అన్నారు. ఉన్నత విద్యను ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడం సరైనది కాదన్నార. ప్రజలందరికీ సమాన విద్య అందించాలని డిమాండ్ చేశారు.