భారీగా పట్టుబడ్డ నిషేధిత గుట్కా ప్యాకెట్లు

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లు పట్టుబడినట్లు ఏసీపీ వాసాల సతీష్ తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిషేధిత గుట్కా అక్రమ రవాణా అవుతున్నట్లు నమ్మదగిన  సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. దీంతో  హుస్నాబాద్ ఎస్సై సజ్జనపు శ్రీధర్, తన సిబ్బందితో పందిళ్ల గ్రామ సమీపంలోని వాహనాలు తనిఖీ చేయగా.. సిద్దిపేట పట్టణానికి చెందిన మహమ్మద్ చాంద్ పాషా, […]

Update: 2021-12-07 08:38 GMT

దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లు పట్టుబడినట్లు ఏసీపీ వాసాల సతీష్ తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిషేధిత గుట్కా అక్రమ రవాణా అవుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. దీంతో హుస్నాబాద్ ఎస్సై సజ్జనపు శ్రీధర్, తన సిబ్బందితో పందిళ్ల గ్రామ సమీపంలోని వాహనాలు తనిఖీ చేయగా.. సిద్దిపేట పట్టణానికి చెందిన మహమ్మద్ చాంద్ పాషా, కోహెడ మండలం పెద్ద సముద్రాలకు చెందిన మహమ్మద్ అలీ అను నిందితులను పట్టుకున్నారు. వీరు టీఎస్ 36 హెచ్ 7003 కారులో బీదర్ నుంచి నిషేధిత అంబార్, గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 6.62500లక్షల విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను రిమాండ్ తరలించామని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ శ్రీధర్, కానిస్టేబుల్ రవి, సంపత్ శంకర్, హోంగార్డు మల్లారెడ్డిలను అభినందించారు.

Tags:    

Similar News