ప్రొఫెసర్ జయశంకర్ కృషి మరువలేనిది: ఎమ్మెల్యే రేగా

దిశ, మణుగూరు : తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 87వ జయంతి వేడుకలను పినపాక శాసనసభ సభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం భూర్గంపాహాడ్ మండలం జడ్పీటీసీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం భూర్గంపాహాడ్ మండలంలో అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి, నేను మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చి రేగా విష్ణు మెమోరియల్ చారిట్రబుల్ […]

Update: 2021-08-06 03:53 GMT
jayashankar 1
  • whatsapp icon

దిశ, మణుగూరు : తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 87వ జయంతి వేడుకలను పినపాక శాసనసభ సభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం భూర్గంపాహాడ్ మండలం జడ్పీటీసీ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం భూర్గంపాహాడ్ మండలంలో అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి, నేను మీకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చి రేగా విష్ణు మెమోరియల్ చారిట్రబుల్ ట్రాస్ ద్వారా కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని మారువలేమన్నారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర ఎంతో కీలకం అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిదర్శనం ఒక్క జయశంకర్ అని, నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజలు ఎవరైనా ఇబ్బందులకు గురైతే నా దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. ప్రజా సేవకే నా జీవితమన్నారు. ఈ కార్యక్రమంలో భూర్గంపాహాడ్ మండల జడ్పీటీసీ కామిశెట్టి శ్రీలత, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News