‘బియ్యం రాకపాయే.. టైం ఏమో అయిపాయే.. ఇప్పుడేం జేసుడు..’
దిశ ప్రతినిధి, మెదక్ : పేదల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థయైనా రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని అందిస్తోంది. అయితే రేషన్ పంపిణీలో కొన్ని కారణాల వల్ల షాపులకు బియ్యం అందడం లేదు. స్టాకు అయిపోయిన వెంటనే డీలర్లు ప్రభుత్వానికి అదనపు బియ్యం ఆర్జీ పెట్టుకోగా ప్రభుత్వం వెంటనే అనుమతిస్తోంది. కానీ సంబంధిత జిల్లా గోదాముల నుండి బియ్యం షాపులకు చేరడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఫలితంగా లబ్దిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. […]
దిశ ప్రతినిధి, మెదక్ : పేదల కడుపు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థయైనా రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని అందిస్తోంది. అయితే రేషన్ పంపిణీలో కొన్ని కారణాల వల్ల షాపులకు బియ్యం అందడం లేదు. స్టాకు అయిపోయిన వెంటనే డీలర్లు ప్రభుత్వానికి అదనపు బియ్యం ఆర్జీ పెట్టుకోగా ప్రభుత్వం వెంటనే అనుమతిస్తోంది. కానీ సంబంధిత జిల్లా గోదాముల నుండి బియ్యం షాపులకు చేరడం లేదని డీలర్లు చెబుతున్నారు. ఫలితంగా లబ్దిదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రేషన్ పంపిణీ చివరి రోజు సర్వర్ డౌన్ కావడంతో కొంత మంది ఈ నెల రేషన్ బియ్యాన్ని పొందలేకపోయారు.
బియ్యం పంపట్లే …
రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందిచేందుకు గాను సిద్దిపేట జిల్లాలో 680 రేషన్ షాపులు ఉండగా మెదక్ జిల్లాలో 521, సంగారెడ్డి జిల్లాలో 847 దుకాణాలు ఉన్నాయి. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 2,048 రేషన్ షాపుల ద్వారా పేదలకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. కాగా ఇటీవల కరోనా కారణంగా ప్రతి లబ్ధిదారుడికి మరో ఐదుకిలోల బియ్యం అదనంగా వస్తుంది. గత నెలలో రేషన్ కోటా తగ్గించగా .. వాటిని కలుపుకొని ఈ నెలలో ఒక్కో లబ్ధిదారుడికి 15 కిలోల చొప్పున అందిస్తున్నారు. కొత్త కార్డులు మంజూరైన వారికి ఒక్కో వ్యక్తికి 10 కిలోలు, అంత్యోదయ కార్డు కల్గినవారికి 35 కిలోల బియ్యం అందిస్తున్నారు. రేషన్ కోటా బియ్యం పెరగడంతో రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించిన నాలుగైదు రోజులకే బియ్యం అయిపోతున్నాయి. తిరిగి లబ్ధిదారులు అదనపు బియ్యం కోసం ప్రభుత్వాన్ని కోరగా ప్రతి రేషన్ షాపు బియ్యాన్ని కేటాయిస్తుంది. ఇంత వరకు బాగానే ఉన్నా గోదాముల నుండి సంబంధిత నిర్వాహకులు షాపులకు బియ్యాన్ని పంపడం లేదు. సుమారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండు వందలకు పైగా షాపుల్లో బియ్యం అయిపోయినట్టు సమాచారం. వాటికి ఇప్పటి వరకు బియ్యాన్ని పంపలేదు. ఫలితంగా రోజు రేషన్ షాపులకు వస్తూ బియ్యం రాలేదన్న సమాచారం తెలుసుకొని తిరిగి వెళ్తున్నారు.
చివరి రోజు సర్వర్ డౌన్ ….
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4వ తేదీన రేషన్ పంపిణీని ప్రారంభించి 18వ తేదీ చివరి తేదీగా నిర్ణయించింది. చివరి రోజు సర్వర్ డౌన్ కారణంగా రేషన్ బియ్యం పంపిణీ చేయడం కుదరలేదు. ఇదిలా ఉండగా మున్సిపాలిటీల్లో మొదటి సారి వచ్చిన బియ్యం కొన్ని ప్రాంతాల్లో పదో తేదీలోగా పూర్తిగా.. గ్రామీణ ప్రాంతాల్లో 14 వ తేదీ వరకు పూర్తయ్యాయి. రెండో సారి అదనపు బియ్యం పంపిణీ కావాలని అర్జీ పెట్టుకోగా ప్రభుత్వం అనుమతిచ్చింది. అయినా సుమారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 షాపుల వరకు ఇప్పటి వరకు బియ్యం రాలేదు. దీంతో కొందరు లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందని పరిస్థితి నెలకొంది. కొన్ని షాపులకు చివరి రోజు బియ్యాన్ని పంపగా .. ఆ రోజు సాంకేతిక సమస్యల కారణంగా సర్వర్ డౌన్ అయ్యింది. ఇలాగూ మరికొందరు లబ్ధిదారులు బియ్యాన్ని పొందలేకపోయారు. ఈ నెల బియ్యం పొందలేని లబ్ధిదారులు బియ్యం పంపిణీ సమయాన్ని పొడగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.