టైమ్‌కు రాని డాక్టర్లు.. ములుగులో గర్భిణుల ఇక్కట్లు
దిశ, ములుగు: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ చూడవలసిన ఓపీ టైమింగ్స్‌లో డాక్టర్లు లేకపోవడం గర్భిణీ స్త్రీల పాలిట శాపంగా మారింది. ములుగు ఏరియా ఆసుపత్రిలో వారానికి మూడు రోజులు సోమ, బుధ, శుక్ర, వారాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గర్భిణీ స్త్రీలను పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు […]
దిశ, ములుగు: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ చూడవలసిన ఓపీ టైమింగ్స్‌లో డాక్టర్లు లేకపోవడం గర్భిణీ స్త్రీల పాలిట శాపంగా మారింది. ములుగు ఏరియా ఆసుపత్రిలో వారానికి మూడు రోజులు సోమ, బుధ, శుక్ర, వారాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గర్భిణీ స్త్రీలను పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన డాక్టర్లు దాదాపుగా 11:45 నిమిషాలకు రావడం జరిగింది. ప్రతి వారం ఈ విధంగా జరగడం వలన గర్భిణీ స్త్రీలు అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలియజేస్తున్నారు. దీనికి తోడు ఏరియా ఆస్పత్రిలో వచ్చే పేషెంట్లకు మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగ్గా ముక్కు మూసుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గర్భిణీ స్త్రీలు కోరుతున్నారు.