బ్లాక్‌ఫంగస్ రోగులకు తప్పని తిప్పలు

దిశ, అంబర్ పేట్: బ్లాక్‌ఫంగస్ తో ఈఎన్‌టీకి వచ్చే రోగులు ఎవరి ఆక్సిజన్ వారు తెచ్చుకుంటున్నారు. కొవిడ్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో మాత్రమే బ్లాక్ ఫంగస్ రోగులకు ఆక్సిజన్ అందుబాటులో ఉండడంతో ఈఎన్‌టీ కి వచ్చే నాన్ కొవిడ్ రోగులు స్వయంగా ఆక్సిజన్ కన్సర్‌ట్రేటర్ తమ వెంట తెచ్చుకుంటున్నారు. జహీరాబాద్ కు చెందిన నరసింహ గత ఇరవై రోజుల క్రితం కొవిడ్ రావడంతో అల్వాల్ లో చికిత్స చేయించుకున్నారు. కొవిడ్ తగ్గినప్పటికీ అతనికి లంగ్స్ ఇన్ఫెక్షన్ […]

Update: 2021-05-25 11:11 GMT

దిశ, అంబర్ పేట్: బ్లాక్‌ఫంగస్ తో ఈఎన్‌టీకి వచ్చే రోగులు ఎవరి ఆక్సిజన్ వారు తెచ్చుకుంటున్నారు. కొవిడ్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో మాత్రమే బ్లాక్ ఫంగస్ రోగులకు ఆక్సిజన్ అందుబాటులో ఉండడంతో ఈఎన్‌టీ కి వచ్చే నాన్ కొవిడ్ రోగులు స్వయంగా ఆక్సిజన్ కన్సర్‌ట్రేటర్ తమ వెంట తెచ్చుకుంటున్నారు. జహీరాబాద్ కు చెందిన నరసింహ గత ఇరవై రోజుల క్రితం కొవిడ్ రావడంతో అల్వాల్ లో చికిత్స చేయించుకున్నారు. కొవిడ్ తగ్గినప్పటికీ అతనికి లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో ఆక్సిజన్ తప్పనిసరిగా పెట్టాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇంతలో అతనికి బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కొన్ని రోజులకు గాను రూ.15,000 వేలు చెల్లించడంతో పాటు డిపాజిట్ మరో రూ. 10,000 కట్టి ఆక్సిజన్ కన్సన్‌ట్రెటర్ ను తీసుకున్నాడు.

కోఠి, ఈఎన్‌టీ ఆసుపత్రి ఆక్సిజన్ బెడ్స్ లేవని తెలియడంతో మంగళవారం రోగితో పాటు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ తీసుకొని ఆస్పత్రికి వచ్చారు. ఆసుపత్రిలో పడకల కోసం ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద కూర్చుండి పోయారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆస్పత్రిలో బెడ్ దొరకడంతో ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ తరుచు రోగికి ఆక్సిజన్ అందించాలన్నారు. కాగా ఆస్పత్రిలో 125 బెడ్ లకు ఆక్సిజన్ ఏర్పాటు చేసినందుకు టీఎన్ఎస్ఐడిసి అధికారుల ద్వారా కాంట్రాక్టు పొందిన వ్యక్తి ప్రస్తుతం పనులు నిలిపి వేయడంతో వార్డులో పైప్ లైన్ పనులు పూర్తి కాలేదు. దీంతో ఆక్సిజన్ వారే తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. బుధవారం నుంచి సరోజినీదేవి ఆసుపత్రి లో దాదాపు 150 ఆక్సిజన్ సీట్లు అందుబాటులోకి రావడంతో కష్టాలు తీరనున్నాయని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News