మోడీ హామీలకే పరిమితం : ప్రియాంక గాంధీ
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అస్సాంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్టార్ క్యాంపెనర్‌గా ప్రియాంక గాంధీ వ్యవహరించగా.. ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మోడీ విస్మరించారని, అసోం తేయాకు కార్మికులకు రూ.350 వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని విమర్శించారు. మోడీ ఒక్కసారైనా అసోం టీ తోటలకు వెళ్లి కార్మికులను […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అస్సాంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్టార్ క్యాంపెనర్‌గా ప్రియాంక గాంధీ వ్యవహరించగా.. ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మోడీ విస్మరించారని, అసోం తేయాకు కార్మికులకు రూ.350 వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని విమర్శించారు. మోడీ ఒక్కసారైనా అసోం టీ తోటలకు వెళ్లి కార్మికులను కలిశారా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే కనీస బాధ కూడా ప్రధానికి లేదని ప్రియాంక గాంధీ మండిపడ్డారు.