మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా: ప్రియాంకగాంధీ

          ‘జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ఆరు నెలల క్రితం అన్యాయంగా అరెస్ట్ చేశారు. వాళ్లు ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. వీరే కాకుండా అనేకమంది పౌరులు కాశ్మీర్ లోని నిర్బంధకేంద్రాల్లోనే మగ్గుతున్నారు. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు.           ఆరు నెలల క్రితం […]

Update: 2020-02-05 03:35 GMT

‘జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను ఆరు నెలల క్రితం అన్యాయంగా అరెస్ట్ చేశారు. వాళ్లు ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. వీరే కాకుండా అనేకమంది పౌరులు కాశ్మీర్ లోని నిర్బంధకేంద్రాల్లోనే మగ్గుతున్నారు. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆరు నెలల క్రితం ఇది ఇంకెంత కాలం కొనసాగుతుందని అడిగామనీ, ఇప్పుడేమో మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అని అడగాల్సిన పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. కాగా, ఆర్టికల్ 370రద్దు నేపథ్యంలో ఆగస్టు 5న అనేక మంది నాయకులు, కార్యకర్తలు, పౌరులను కేంద్రం అదుపులోకి తీసుకుని నిర్బంధ కేంద్రాల్లో ఉంచిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News