అమ్మకు ప్రియాంక స్వీట్ బర్త్‌డే విష్
ఇంటర్నేషనల్ సెన్సేషన్ ‘ప్రియాంక చోప్రా’.. తన తల్లి ‘మధు చోప్రా’ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. తల్లితో ఉన్న మధుర జ్ఞాపకాలను వీడియో రూపంలో పంచుకున్న ఈ గ్లోబల్ స్టార్.. తనను చాలా మిస్ అవుతున్నట్లు తెలిపింది. ‘నా బ్యాక్ బోన్, నా బలం, నా స్ఫూర్తి, నా బెస్ట్ ఫ్రెండ్, నా తల్లికి హ్యాపీ బర్త్‌డే’ అంటూ విషెస్ చేసింది. ‘ఈ టైమ్‌లో నిన్ను చాలా మిస్ అవుతున్నా అమ్మ.. నీ పుట్టినరోజున అందరం […]
ఇంటర్నేషనల్ సెన్సేషన్ ‘ప్రియాంక చోప్రా’.. తన తల్లి ‘మధు చోప్రా’ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. తల్లితో ఉన్న మధుర జ్ఞాపకాలను వీడియో రూపంలో పంచుకున్న ఈ గ్లోబల్ స్టార్.. తనను చాలా మిస్ అవుతున్నట్లు తెలిపింది. ‘నా బ్యాక్ బోన్, నా బలం, నా స్ఫూర్తి, నా బెస్ట్ ఫ్రెండ్, నా తల్లికి హ్యాపీ బర్త్‌డే’ అంటూ విషెస్ చేసింది. ‘ఈ టైమ్‌లో నిన్ను చాలా మిస్ అవుతున్నా అమ్మ.. నీ పుట్టినరోజున అందరం కలిసి ఎంజాయ్ చేయడాన్ని ఈసారి మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. త్వరలోనే కలుస్తా మామ్.. లవ్ యూ’ అని తెలిపింది.
ప్రస్తుతం భర్త నిక్ జోనస్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్న ప్రియాంక చోప్రా.. కొవిడ్ -19 మహమ్మరిపై పోరాడేందుకు విరాళాలు సేకరించడంలో బిజీగా ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక చివరగా సోనాలి బోస్ దర్శకత్వంలో వచ్చిన ‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రంలో కనిపించింది. ఫర్హాన్ అక్తర్, జైరా వాసిమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది అక్టోబర్‌లో రిలీజైంది.