సమీప భవిష్యత్తులో ఆ చట్టాలు ప్రయోజనాలిస్తాయి : మోడీ
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం వారణాసి నుంచి ప్రయాగ్ రాజ్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి-19ను పనులను ప్రారంభించడానికి ఆయన యూపీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు అనవసరమైన భయాన్ని రైతుల్లో […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని రైతులకు మేలు చేసేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చామని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం వారణాసి నుంచి ప్రయాగ్ రాజ్ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి-19ను పనులను ప్రారంభించడానికి ఆయన యూపీ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్షాలు అనవసరమైన భయాన్ని రైతుల్లో కలుగజేస్తున్నారని చెప్పుకొచ్చారు.
‘భాజపా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలకు మేలు చేసేవే కానీ కీడు చేయవని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ కొత్త చట్టాల వలన కలిగే ప్రయోజనాలను మేము చూస్తాము మరియు అనుభవిస్తాము అని మోడీ స్పష్టంచేశారు.
The new agricultural laws have been brought in for benefit of the farmers. We will see and experience benefits of these new laws in the coming days: PM Modi in Varanasi pic.twitter.com/bY7mwT3E55
— ANI UP (@ANINewsUP) November 30, 2020
ఇదిలాఉండగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు గత కొద్దిరోజులుగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో అక్కడి పోలీసులు రైతులపై లాఠీచార్జి చేశారు.ఈ దాడిలో పలువురు రైతులు గాయపడినట్లు సమాచారం. కాగా, రైతులతో చర్చలకు సిద్దంగా ఉన్నామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. కానీ, ఎలాంటి కండిషన్స్ లేకుండా ఆ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, అప్పుడే చర్చలకు తాము సిద్ధమని పంజాబ్, హర్యానా రైతులు స్పష్టం చేశారు.మరోవైపు రైతులపై పోలీసుల దాడిని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.