స్వామి దయతో ఇప్పుడు ఓకే: మంత్రి
దిశ, ఏపీ బ్యూరో: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దయ వల్ల కరోనా నుంచి ప్రజలు త్వరలోనే విముక్తి చెందుతారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం నాదనీరాజన వేదికపై నిర్వహిస్తున్న సుందర కాండ పారాయణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయం ఎదుట తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టీటీడీ ప్రతిరోజూ ఉదయం 7 నుంచి […]
దిశ, ఏపీ బ్యూరో: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దయ వల్ల కరోనా నుంచి ప్రజలు త్వరలోనే విముక్తి చెందుతారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఆయన స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం నాదనీరాజన వేదికపై నిర్వహిస్తున్న సుందర కాండ పారాయణంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఆలయం ఎదుట తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టీటీడీ ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుందరకాండ పారాయణం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు విరాట పర్వ పారాయణం నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని మంత్రి చెప్పారు. స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు టీటీడీ కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు అమలు చేస్తూ సంతృప్తికర దర్శనం కల్పిస్తోందన్నారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమనే ఉద్దేశంతో వినాయక చవితి పండుగను ప్రజలు ఇళ్లలోనే చేసుకోవాలని సూచించించామని తెలిపారు. ఆలయాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో కార్యక్రమాలు చేయాలని ఆదేశించినట్లు మంత్రి వివరించారు.