డెలివరీ కాలేదు..రాత్రికి రాత్రే కడుపులో బిడ్డ మాయం!

దిశ, మహబూబ్ నగర్: మాములుగా ఆస్పత్రిలో బిడ్డ పుట్టాక కనిపించకుండా పోవడం, డబ్బుల కోసం ఎవరైనా ఎత్తుకెళ్లడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న ఘటనలు. కానీ ఓ నిండు గర్భిణీ కడుపులో ఉన్న బిడ్డ రాత్రికి రాత్రే మాయం అయింది. ప్రస్తుతం ఈ విషయం జోగులాంబ గద్వాల జిల్లాలోని మనోపాడు మండలంలో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకివెళితే..పెద్దపోతుపాడు గ్రామానికి చెందిన మానస(25)కు ఆరేండ్ల కిందట చిన్నపోతుపాడుకు చెందిన వెంకటేశ్‌తో వివాహం జరిగింది. గతేడాది మానస తల్లి కానున్నట్టు వైద్యులు […]

Update: 2020-05-03 11:36 GMT

దిశ, మహబూబ్ నగర్: మాములుగా ఆస్పత్రిలో బిడ్డ పుట్టాక కనిపించకుండా పోవడం, డబ్బుల కోసం ఎవరైనా ఎత్తుకెళ్లడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న ఘటనలు. కానీ ఓ నిండు గర్భిణీ కడుపులో ఉన్న బిడ్డ రాత్రికి రాత్రే మాయం అయింది. ప్రస్తుతం ఈ విషయం జోగులాంబ గద్వాల జిల్లాలోని మనోపాడు మండలంలో కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకివెళితే..పెద్దపోతుపాడు గ్రామానికి చెందిన మానస(25)కు ఆరేండ్ల కిందట చిన్నపోతుపాడుకు చెందిన వెంకటేశ్‌తో వివాహం జరిగింది. గతేడాది మానస తల్లి కానున్నట్టు వైద్యులు నిర్దారించారు. నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి స్థానిక ఆశావర్కర్‌ సాయంతో మనోపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె నెలసరి పరీక్షలు చేయించుకుంటోంది. ప్రస్తుతం ఆమెకు 9 నెలలు నిండాయి. శనివారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మనోపాడు ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు.ఈ క్రమంలోనే మానసకు దేవుడు పూనినట్టు ఊగడం, గట్టిగా కేకలు వేస్తూ వైద్య సేవలకు నిరాకరించింది.

ఇంటికి వెళ్ళాక ఏం జరిగింది?

పురిటి నొప్పులతో వచ్చిన మానస తనకు వైద్యం అవసరం లేదని, ఇంటికి వెళతానని పట్టుబట్టడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో ఇంటికి తీసుకెళ్లారు.ఇంటికి వెళ్లిన అనంతరం ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది. అసలు కథ ఇక్కడే మొదలయింది. గర్భిణీతో పాటు నిద్రపోయిన కుటుంబ సభ్యులు ఉదయం లేచి చూసేసరికి ఆమె కడుపు ఖాళీగా ఉండటాన్ని గమనించారు. విషయం ఏంటనీ ఆమెను అడగ్గా దేవుడు వచ్చి తన బిడ్డను తీసుకెళ్లాడని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అది విన్న కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న పీహెచ్‌సీ వైద్యురాలు దివ్య ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టింది.

డాక్టర్ వివరణ..

మానస గత ఏడు నెలల కిందట కడుపుతో ఉన్నప్పుడు తానే పరీక్షించినట్టు డాక్టర్‌ చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె డెలివరీ అయినట్టు, అబార్షన్‌ అయినట్టు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు.స్కానింగ్‌ చేస్తే గాని వాస్తవాలు తెలియవని వివరించారు. బాధితురాలు తెలిపినట్టు దేవుడు ఆవహించాడు అనేది అవాస్తవం.స్కానింగ్‌ రిపోర్టును బట్టి అసలు నిజాలు తెలుస్తాయని వైద్యురాలు స్పష్టం చేశారు. ఆమె వెంట వచ్చిన ఆశా వర్కర్లు మాత్రం నిండు గర్భిణీని ఆస్పత్రికి తీసుకొచ్చామని, అయితే కడుపు ఎలా ఖాళీ ఎలా అయ్యిందో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. మానస తల్లిదండ్రులు, భర్త కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. మొత్తంగా ఈ విషయం ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపింది.రాత్రికి రాత్రే కడుపులో బిడ్డ ఎలా మాయం అయ్యింది తెలియాలంటే స్కానింగ్ రిపోర్టు వచ్చేవరకు వేచిచూడాల్సిందే.

tags : one night, no delivery, pregnancy missing, victim said god take the baby, mystery

Tags:    

Similar News