మా ఆయన బంగారం అంటున్న మొహుల్ చోక్సీ భార్య..
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలోని బ్యాంకులకు కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తల దాచుకున్న ఆర్థిక నేరస్తుడు, వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీపై ఆయన భార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల భారత ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్లను దేశానికి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మొహుల్ చోక్సీలను దేశ న్యాయస్థానాల ముందు నిలిపేందుకు వారు తలదాచుకున్న ఆయా దేశాల అధినేతలతో మాట్లాడి దౌత్యపరంగా చర్యలు చేపడుతోంది. ఇటీవల […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలోని బ్యాంకులకు కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తల దాచుకున్న ఆర్థిక నేరస్తుడు, వజ్రాల వ్యాపారి మొహుల్ చోక్సీపై ఆయన భార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల భారత ప్రభుత్వం ఆర్థిక నేరగాళ్లను దేశానికి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, మొహుల్ చోక్సీలను దేశ న్యాయస్థానాల ముందు నిలిపేందుకు వారు తలదాచుకున్న ఆయా దేశాల అధినేతలతో మాట్లాడి దౌత్యపరంగా చర్యలు చేపడుతోంది. ఇటీవల మొహుల్ చోక్సీ తలదాచుకున్న అంటిగ్వా దేశాధినేతతో భారత ప్రభుత్వం చర్చించగా అతన్ని ఇండియాకు అప్పగించేందుకు ఆ దేశం అంగీకరించింది.
ఇక్కడి నుంచి కొందరు అధికారులు చోక్సీని తీసుకొచ్చేందుకు అంటిగ్వా వెళ్లారు. తీరా అప్పగించే సమయంలో మరో కోర్టు వివాదం ముందుకు రావడంతో చోక్సీని ఇప్పట్లో ఇండియాకు అప్పగించడం జరగదని తేలిపోయింది. ఆ తర్వాత చోక్సీ కిడ్నాప్ అయినట్లు కథనాలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా చోక్సీ భార్య ప్రీతి చోక్సీ స్పందించారు. ‘ మా ఆయన బంగారం అని ఆమె కితాబిచ్చారు. అసలు కుట్రదారు అంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌనే అని చెప్పారు. తన భర్త కనిపించకుండా పోయిన సమయంలో ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు పనిచేయలేదని ఆమె వివరించారు. కావాలని తన భర్తపై కుట్రకు యత్నించారని ప్రీతి చోక్సి ఆరోపించారు. ఇదిలాఉండగా, చోక్సీని ఎవరూ కిడ్నాప్ చేయలేదని, అతనే ఎక్కడో దాక్కుని ఉంటాడని అంటిగ్వా ప్రధాని స్పష్టం చేశాడు.