'ఆమెతో పోలిస్తే మోడీ పాపులారిటీ దిగదుడుపే'
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా పాపులరే కావొచ్చు గానీ పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాష్ట్రంలో ఉన్న ఫాలోయింగ్‌తో పొల్చితే మాత్రం ఆయన దిగదుడుపే అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీకి రాష్ట్రంలో ఉన్న ఇమేజీతో పోల్చితే మోడీ పాపులారిటీ పెద్దగా […]
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా పాపులరే కావొచ్చు గానీ పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాష్ట్రంలో ఉన్న ఫాలోయింగ్‌తో పొల్చితే మాత్రం ఆయన దిగదుడుపే అంటున్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీకి రాష్ట్రంలో ఉన్న ఇమేజీతో పోల్చితే మోడీ పాపులారిటీ పెద్దగా ఉండదని అభిప్రాయపడ్డారు. మోడీకున్న ఇమేజీ లోక్‌సభ ఎన్నికలలో పనిచేసిందేమో గానీ రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం తేలిపోయిందని చెప్పారు. బీజేపీ పార్లమెంటు ఎన్నికలలో కనబరిచిన ప్రదర్శన.. అసెంబ్లీ ఎలక్షన్లలో తేలిపోయిందని వివరించారు.
2019 నుంచి చూస్తే రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికలలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్, బీహార్ ఎన్నికలలో మోడీ ఛరిష్మా ఏపాటిదో తేలిపోయిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బెంగాల్‌లో బీజేపీ డబుల్ డిజిట్‌కు మించి ఒక్క సీటు కూడా ఎక్కువ గెలుచుకోదని తాను చేసిన ట్వీట్‌కు కట్టుబడి ఉన్నానని పీకే పునరుద్ఘాటించారు