నువ్వే నా శ్వాస.. స్నేహకు ప్రసన్న విషెస్
దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్ స్నేహ.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్లో దూసుకుపోయింది. ఆ తర్వాత హీరో ప్రసన్నను ప్రేమ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న స్నేహ అండ్ ప్రసన్న జంటను చూస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా సాగుతున్న ప్రయాణం.. ఇద్దరు పిల్లలతో రీల్ లైఫ్‌ను మించిన ఆనందంగా ఉండగా, స్నేహ పుట్టినరోజును పురస్కరించుకుని హార్ట్‌ఫుల్‌గా బెస్ట్ విషెస్ అందించాడు ప్రసన్న. […]
దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్ స్నేహ.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ రేంజ్లో దూసుకుపోయింది. ఆ తర్వాత హీరో ప్రసన్నను ప్రేమ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న స్నేహ అండ్ ప్రసన్న జంటను చూస్తే చూడ ముచ్చటగా ఉంటుంది. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా సాగుతున్న ప్రయాణం.. ఇద్దరు పిల్లలతో రీల్ లైఫ్‌ను మించిన ఆనందంగా ఉండగా, స్నేహ పుట్టినరోజును పురస్కరించుకుని హార్ట్‌ఫుల్‌గా బెస్ట్ విషెస్ అందించాడు ప్రసన్న. తన లైఫ్‌లో స్నేహకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుపుతూ పోస్ట్ పెట్టాడు.
‘ఏళ్లు గడిచిపోతున్నా.. మేము మాత్రం ఒకే మూమెంట్ దగ్గర ఆగిపోయాం. అదే.. మేమిద్దరం కలిసి ప్రేమలో పడిన విషయం’ అని చెప్పాడు ప్రసన్న. దీనికి మించిన గొప్ప ఘటన తన జీవితంలో లేదన్నారు. ‘ఇన్నాళ్లు నీతో చెప్పినట్లు నీ పట్ల నాకున్న ప్రేమ.. సముద్రంలో నీటి చుక్కంత కూడా లేదు.. కానీ నా ఆత్మలోని ప్రతీ చుక్కలో నువ్వే ఉన్నావ్’ అంటూ స్నేహ మీద తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు. తనలోని లోపాలను సరిదిద్దుతూ.. ముందుకు సాగేలా చేస్తున్నందుకు, అద్భుతమైన ప్రేమను పంచుకున్నందుకు థాంక్స్ చెప్పాడు. ‘నువ్వే నా శ్వాస.. నువ్వు కోరుకున్న ప్రతీది లభించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని చెప్పాడు.